crowded
-
కరోనా ఎఫెక్ట్‌తో ఆర్టీసీ వెలవెల
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి ప్రజా రవాణాపై ప్రభావం కన్పిస్తోంది. ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు కలసి ప్రయాణించటం ప్రస్తుత పరిస్థితిలో క్షేమం కాకపోవటంతో క్రమంగా రాకపోకలు తగ్గించేలా ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్రం ఇప్పటికే అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా రైల్వే శాఖ రైళ్లను నియంత్రించే చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పలు రైళ్లు రద్దు య్యాయి. తెలంగాణ ఆర్టీసీపైనా కరోనా ఎఫెక్ట్ అలాగే తెలంగాణ ఆర్టీసీపై కరోనా వైరస్ ప్రభావం పడింది. తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికుల రద్దీ తగ్దింది. ప్రయాణికులు లేకపోవడంతో రద్దీగా ఉండే బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. ఈ నెల 31 వరకూ పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో నగర వాసులు పల్లెబాట పట్టారు. మరోవైపు షిర్డీ ఆలయాన్ని మంగళవారం నుంచి మూసేసిన నేపథ్యంలో షిర్డీ సర్వీసులను మాత్రం రద్దు చేసింది. మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు నాలుగు సర్వీసులు తగ్గించింది. చదవండి: కరోనా ఎఫెక్ట్: ఇకపై వాట్సాప్‌లో పరీక్షా ఫలితాలు కాగా, కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైళ్లలో ఆహారం సరఫరా నిలిపేయటమే శ్రేయస్కరమన్న అభిప్రాయం రైల్వేలో వ్యక్తమవుతోంది. దీంతో ప్యాంట్రీకార్లను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రయాణికులే సొంతంగా ఆహారాన్ని తెచ్చుకునేలా పిలుపునివ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. -
యాదాద్రిలో భక్తులరద్దీ
సాక్షి,యాదగిరిగుట్ట : తెలంగాణ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ్మస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి ఎక్కువైంది. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది. సెలవుల కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయి. దీంతో భక్తులు కుటుంబసమేతంగా రావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. ఆలయ పునర్నిర్మాణం కారణంగా స్థలాభావంతోపాటు పార్కింగ్, భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు వాహనాలను కొండ పైకి అనుమతించడం లేదు. -
పుణ్యక్షేత్రాల్లో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి/వేములవాడ: వరుస సెలవులు రావడంతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదాద్రి, వేములవాడల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలపైగా సమయం పడుతున్నది. కొండపైన తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో భక్తుల వాహనాలను తులసి కాటేజ్ వద్ద నిలిపివేశారు. వేములవాడలో... వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతున్నది. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో శీఘ్ర దర్శనాన్ని అధికారులు అమలు చేశారు. -
ఊరు పిలిచింది
అనుభూతుల సరాగం, ఆత్మీయ అనుబంధం, ఆహ్లాద వాతావరణం.. ఆస్వాదించేందుకు పట్నం పల్లె బాట పట్టింది. ఉన్న ఊరిని, కన్న వారిని కలిసేందుకు కోటి ఆశలతో పల్లెతల్లి లోగిళ్లకు చేరుతోంది. సంక్రాంతి పండగ సందర్భంగా సిటీజనులు గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రద్దీ ఎక్కువ ఉండడంతో తోపులాట జరిగింది. – అడ్డగుట్ట -
బ్యాంకుల్లో కొనసాగిన రద్దీ
ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని తొమ్మిది బ్యాంకుల్లో శనివారం నోట్ల కోసం రద్దీ కొనసాగింది. స్థానిక సహకార బ్యాంకులో ధాన్యం అమ్ముకున్న రైతులు డబ్బుల కోసం ఉదయం నుంచే క్యూలైన్ కట్టారు. శనివారం సగం పూట బ్యాంకులు నడుస్తాయని తెలిసి ఉదయం 8గంటలకే ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రజలు నోట్ల కోసం ఇబ్బందులు పడ్డారు. గొల్లపల్లి గ్రామీణ, ఆంధ్రాబ్యాంకులో మధ్యాహ్నం వరకే డబ్బులు అయిపోయినట్లు ప్రకటించి బ్యాంకు సిబ్బంది గేట్లకు తాళాలు వేశారు. క్యూలైన్ కట్టిన కొంత మందికి డబ్బులు అందకపోవడంతో వారు నిరాశతో ఇంటిదారిపట్టారు. రైతులు మాత్రం సహకార బ్యాంకు వద్ద సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. -
రైళ్లన్నీ రద్దీ!
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరాది రైళ్లు ప్రయాణికులతో పోటెత్తుతున్నాయి. దీపావళి, చత్ పూజల దృష్ట్యా నగరవాసులు భారీ సంఖ్యలో సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వైపునకు వెళ్లే రైళ్లలో భారీ రద్దీ నెలకొంది. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా అదనపు రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే అన్ని రైళ్లలో రిజర్వేషన్ బెర్తులు నిండిపోయాయి. కొన్నింటిలో వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరుకోగా, మరికొన్ని రైళ్లలో రిగ్రెట్ దర్శనమిస్తోంది. ఒక్క సికింద్రాబాద్–పట్నాల మధ్య మాత్రమే వారానికి ఒక అదనపు రైలును ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి తత్కాల్ బోగీల్లో కూడా వెయిటింగ్ లిస్టు 50 నుంచి 100 వరకు పెరిగింది. ఉత్తరాది ప్రజలు ఎంతో ఘనంగా చేసుకొనే దీపావళి పర్వదినం, చత్ పూజల కోసం ప్రతి సంవత్సరం నగరం నుంచి లక్షలాది మంది తరలివెళ్తారు. కానీ అందుకు తగిన విధంగా రైళ్లు అందుబాటులో లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
శ్రీశైల మహ క్షేత్రంలో భక్తిల రద్దీ
-
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు , ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటలు. కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 52,977 మంది భక్తులు దర్శించుకున్నారు