ఎండ తీవ్రత తగ్గి కొద్ది రోజులుగా ఊపిరి పీల్చుకుంటున్న రాష్ట్ర ప్రజలకు మరింత ఉపశమనం!
ఒక్కోసారి కాస్త ఆలస్యమూ కావచ్చు. ప్రస్తుతానికైతే రాష్ట్రంలోకి వాటి ఆగమనానికి ఎలాంటి అడ్డంకులూ లేవు’’అని ఆయన చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో జగిత్యాలలో 11 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ధర్పల్లి, గట్టుల్లో 7 సెంటీమీటర్లు, జక్రాన్‌పల్లి, నవీపేట్, గంగాధర, మాగ్నూరు, మాక్లూరుల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మద్దూరు, నిజామాబాద్, జూరాల, మెట్‌పల్లి, రెంజల్, భీంగల్, మల్యాల్, బోథ్‌ల్లో 5 సెంటీమీటర్లు కురిసింది. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.