మీసేవలో ఈసీ, సీసీల జారీ కూడా ఉండదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి జూన్ 2వ తేదీ ఉదయం 10 గంటల వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అన్ని రకాల సేవలూ నిలిచిపోనున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడిగా ఉన్న సెంట్రల్ సర్వర్‌ను ఇరు రాష్ట్రాలకూ వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి ఉన్నందున 30వ తేదీ సాయంత్రం 6 నుంచి సర్వర్‌ను నిలిపివేస్తున్నారు. ఫలితంగా ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో మీసేవ కేంద్రాల్లో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు(ఈసీలు), సర్టిఫైడ్ కాపీల(దస్తావేజు నకళ్లు) జారీ ప్రక్రియ ఆగిపోనుంది. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల క్రయ విక్రయ దస్తావేజుల రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా నిలిచిపోతాయని సంబంధిత అధికారులు తెలిపారు.
మే 31, జూన్ 1నరిజిస్ట్రేషన్లు బంద్
Published Mon, May 26 2014 1:33 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM
Advertisement