రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్.....
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ (సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/టీఎస్‌ఎస్‌పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో కానిస్టేబుల్ (పురుష), అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం బుక్‌లెట్లు, ప్రాథమిక కీను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది. www.tslprb.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ నెల 28 సాయంత్రం 5 లోగా ప్రాథమిక కీపై ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు