గట్టు మండలం గ్రామస్తులకు ఊరట | relief for mahabubnagar district gattu mandal farmers in high court | Sakshi
Sakshi News home page

గట్టు మండలం గ్రామస్తులకు ఊరట

Published Mon, Apr 11 2016 3:08 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

గట్టు మండలం గ్రామస్తులకు ఊరట - Sakshi

గట్టు మండలం గ్రామస్తులకు ఊరట

హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలం గ్రామస్తులకు హైకోర్టులో ఊరట లభించింది. సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం గట్టు మండలంలోని దాదాపు ఆరు గ్రామాలకు చెందిన 6 వేల ఎకరాల భూమి స్వాధీనం కోసం ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మార్వోపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరు వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి జూన్ 3వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.

కాగా  గ‌ట్టు మండలం కాలూర్‌తిమ్మన్‌దొడ్డి, కుచినేర్ల, మల్లాపురం, రాయాపురం, ఆలూరు, తుమ్మలచెరువు గ్రామాల‌ శివారుల్లోని సుమారు 5,600 ఎకరాల్లోని అసైన్డ్ భూముల్లో వెయ్యి మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఆ భూములను చాలాకాలంగా రైతులు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు నోటీసులు అందటంతో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement