హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయింపులు ఉంటాయని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి వెల్లడించారు. కొత్త ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని చెప్పారు. బుధవారం ఆయన హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో రోడ్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఆన్లైన్ ద్వారా సేవలు విస్తరిస్తున్నామని చెప్పారు. రవాణా శాఖలో ఖాళీలను కూడా భర్తీ చేస్తామని తెలిపారు.
వాహనదారులకు హెల్మెట్ నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రవాణా శాఖ ఆదాయ లక్ష్యం రెండు వేల కోట్ల రూపాయల్లో 90 శాతం పూర్తి చేసినట్టు పి. మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
'బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయింపులు ఉంటాయి'
Published Wed, Feb 24 2016 2:07 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM
Advertisement