ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సోమవారం ఉదయం సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సోమవారం ఉదయం సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసంలో గంట ఇరవై నిమిషాలపాటు వీరి చర్చలు కొనసాగాయి. రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, పౌర సేవా సదుపాయాల విభాగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించడానికి మైక్రోసాఫ్ట్ సంస్థతో ఈ సందర్భంగా అవగాహన ఒప్పందం కుదిరింది.
తర్వాత సత్య నాదెళ్ల గచ్చిబౌలిలోని టీ హబ్ కు చేరుకున్నారు.