స్థానిక సంస్థలకే పాఠశాలల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మున్సిపాలి టీలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయిం చినట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు పాఠశాలల నిర్వహణకు సంబంధించి విద్యా శాఖ వద్ద ఉన్న నిధులను పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు బదిలీ చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. మరో పక్షం రోజుల్లో ఈ అంశం కొలిక్కిరానుందని పేర్కొన్నారు. ఇంటర్‌లో మార్కుల విధానానికి బదులు గ్రేడింగ్ పెట్టే యోచన ప్రభుత్వానికి లేదన్నారు.