సాక్షి, హైదరాబాద్: బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో తెలంగాణ వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ(టీఎస్‌ఎస్‌వోసీఏ)ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేంద్రియ పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాల స్టాల్ రెండో స్థానంలో నిలిచిందని టీఎస్‌ఎస్‌వోసీఏ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు ఆదివారం వెల్లడించారు. రాష్ట్రంలో సేంద్రియ పద్ధతుల్లో రైతులు పండిస్తున్న బత్తాయి, నిమ్మ, ఉసిరి, జామ, అరటి, సపోటా, పనస పండ్లు సహా పలు కూరగాయలను రాష్ట్ర స్టాల్‌లో ప్రదర్శించారు. జొన్న, సజ్జ, అరికెలు, కొర్రలు వంటి చిరుధాన్యాలను కూడా స్టాల్‌లో ఉంచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment