స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలి: డా. లక్ష్మణ్
కవాడిగూడ (హైదరాబాద్ సిటీ) : నిరుద్యోగ యువతీ యువకులంతా ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా తమ స్వశక్తితో స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించి నిలదొక్కుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. కవాడిగూడ డివిజన్ ఎస్‌బీఐ కాలనీలో పింటు, టింకు, రాజేష్‌లు నూతనంగా ఏర్పాటు చేసుకున్న శ్రీ మోహన్స్ ఛాట్ బండార్ దుకాణాన్ని ఎమ్మెల్యే లక్ష్మణ్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారంతా కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా తమకిష్ఠమైన రంగంలో కానీ, ఇతర వ్యాపార రంగాల్లో స్థిపరపడేలా ఆలోచనలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్ రామ్, అశోక్‌కుమర్, సీహెచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.