MLA laxman
-
కేసీఆర్ పాలనపై లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల ఆశలను వమ్ము చేసేలా కేసీఆర్ పాలన సాగుతోందని, కాంగ్రెస్ పాలనను తలపిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలన, పోలీసుల దౌర్జన్యం రాష్ట్రంలో కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా పది రోజుల పర్యటనలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాక ఆయన ఎన్ఆర్ఐలు వ్యక్త పరిచిన అభిప్రాయాలను తెలియజేశారు. ఎన్ఆర్ఐల అభిప్రాయాలు : హైదరాబాద్‌ను విశ్వనగరం, డల్లాస్‌లా మారుస్తామన్న సీఎం కేసీఆర్ మాటలు నమ్మశక్యంగా లేవని ఎన్‌ఐఆర్‌ఐలు అభిప్రాయపడుతున్నారని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ పేరుతో, తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ చోటు కల్సిస్తున్నారని ప్రవాస భారతీయులు బలంగా భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎన్ఐఆర్ఐల సేవల అవసరమని కోరానని తెలిపారు. వారు పార్టీలోకి చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. బీజేపీలోకి వారికి చోటు కల్పిస్తామని, 2019 ఎన్నికల్లో పోటీ చేయోచ్చన్నారు. వచ్చే 15 రోజుల్లో కొంతమంది ప్రవాస భారతీయులు బీజేపీలో చేరుతారని తెలిపారు. ప్రభుత్వానిది మొద్దు నిద్ర : కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, ఇది అసమర్ధ ప్రభుత్వమని, తాము ఎన్ని సూచనలు చేసినా, పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తామని ఆయన చెప్పారు. 20 రోజులు అసెంబ్లీ సమావేశాలు : ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కనీసం 20 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒవైసీ చిలక పలుకులు పలుకుతున్నారని, ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయన్నారు. ఆ మూడేన్నరేళ్లలో తెలంగాణలో భారీ అవినీతి చోటుచేసుకుందని లక్ష్మణ్ విమర్శించారు. -
గ్రామాల్లో పార్టీ పటిష్టతే లక్ష్యం: కె.లక్ష్మణ్
ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ సీనియర్లను, జూనియర్లను కలుపుకుని ముందుకెళతాం ప్రభుత్వ పథకాలపై కార్యకర్తల ద్వారా విస్తృత ప్రచారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో నూతన అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సైతం పార్టీని పటిష్టం చేస్తానని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రకటించారు. బీజేపీకి సిద్ధాంతపరమైన, బలై మెన నిర్మాణం ఉందని పేర్కొన్నారు. పార్టీలో సీనియర్లను, జూనియర్లను సమన్వయం చేసుకుని వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం లక్ష్మణ్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు? లక్ష్మణ్: పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నాపై నమ్మకం ఉంచి గురుతర బాధ్యతలు అప్పగించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తాను. కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా, సీనియర్ నాయకుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని పని చేస్తాను. మొత్తంగా తెలంగాణలో 2019 నా టికి బలీయమైన శక్తిగా, ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. పార్టీ పగ్గాలను మీకు అధిష్టానం అప్పగించడాన్ని ఎలా చూస్తారు? లక్ష్మణ్: భారతీయ జనతా పార్టీ అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. మిగతా పార్టీల మాదిరిగా వారసత్వాలకు చోటు ఉండదు. ఇక్కడ ఎవరు ఏ స్థాయిలో పని చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. నేను కూడా కార్యకర్తతో మొదలుకుని ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడితో పాటు వివిధ విభాగాల్లో పనిచేశాను. ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. పార్టీ జాతీయ అధ్యక్షుని ఆదేశాలను శిరసావహిస్తాను. సీనియర్లు, జూనియర్లను ఎలా కలుపుకుని వెళ్తారు? లక్ష్మణ్: బీజేపీకి సిద్ధాంతపరమైన బలమైన నిర్మాణం ఉంది. ఎవరైనా అందుకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. పార్టీలో సీనియర్ల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, జూనియర్లను కలుపుకుని ముందుకెళ్తాను. అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. మీ ముందున్న కర్తవ్యం, బాధ్యత ఏమిటి? లక్ష్మణ్: ప్రధానంగా పార్టీని సంస్థాగతంగా గ్రామగ్రామానా బలోపేతం చేయాలి. గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని గ్రామాల్లో పార్టీ జెండా ఎగరాలి. అలాగే కేం ద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. వాటిని కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా లక్ష్మణ్
పార్టీ నాయకత్వం ప్రకటన సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ కె.లక్ష్మణ్‌ను నియమిస్తూ పార్టీ జాతీయ నాయకత్వం శుక్రవారం ప్రకటన చేసింది. ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్షానికి నాయకత్వం వహిస్తున్న లక్ష్మణ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించింది. పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్యనేతలు పోటీ పడినా సీనియారిటీ, అంకితభావాన్ని ప్రాతిపదికగా చేసుకుని లక్ష్మణ్ వైపు జాతీయ నాయకత్వం మొగ్గు చూపింది. ఇప్పటిదాకా పార్టీకి రాష్ట్ర సారథులుగా రాజధాని హైదరాబాద్‌కు చెందినవారే ఎక్కువకాలం పనిచేశారు. ఈసారైనా గ్రామీణ ప్రాంతానికి చెందిన నాయకులకు అవకాశం ఇవ్వాలని జిల్లాల నేతలు పట్టుబట్టారు. 2019 ఎన్నికలను నడిపించాల్సిన ముఖ్యమైన బాధ్యతను దృష్టిలో పెట్టుకుని, పార్టీని తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బలోపేతం చేసే బాధ్యతను లక్ష్మణ్‌పై జాతీయ నాయకత్వం పెట్టింది. దీనితో జిల్లాలకు చెందిన కొందరు నేతలు నిరాశకు గురయ్యారు. లక్ష్మణ్ నేపథ్యం ఇదీ.. డాక్టర్ కె.లక్ష్మణ్ హైదరాబాద్ నగరానికి చెందిన ఎగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీలో చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందారు. ఉస్మానియా యూనివర్సిటీలోని పీజీ సైన్స్ కాలేజీ విద్యార్థి యూనియన్‌కు 1978-80 మధ్యకాలంలో ఎన్నికయ్యారు. 1982-86 మధ్యకాలంలో రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జియాలజీలో డాక్టరేట్ తీసుకున్నారు. 1980లో బీజేపీలో చేరిన లక్ష్మణ్ పార్టీ హైదరాబాద్ శాఖకు ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా పనిచేశారు. రాష్ట్ర పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగానూ సేవలందించారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా 2010-2013 మధ్యకాలంలో పనిచేశారు. ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 1994 నుంచి బీజేపీ అభ్యర్థిగా వరుసగా పోటీ చేస్తున్నారు. 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. పార్టీలో సీనియర్‌గా, ప్రజాప్రతినిధిగా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన నాయకునిగా లక్ష్మణ్‌ను రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ జాతీయ నాయకత్వం నియమించింది. దత్తాత్రేయ హర్షం డాక్టర్ కె.లక్ష్మణ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం సంతోషదాయకమని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. లక్ష్మణ్ నాయకత్వంలో పార్టీ బలంగా ఎదుగుతుందనే విశ్వాసముందన్నారు. అన్ని స్థాయిల్లోని పార్టీ శ్రేణులు లక్ష్మణ్‌కు సహకరించాలని దత్తాత్రేయ కోరారు. -
'మహా ఒప్పందాన్ని బీజేపీ స్వాగతిస్తోంది'
హైదరాబాద్: మహా ఒప్పందాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఎమ్మెల్యే డా.లక్ష్మణ్ చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి.. గోదావరి ఒప్పందాలపై అభినందించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. అంతరాష్ట్ర వివాదాలు కొనసాగుతున్నాయని అన్నారు. వాజ్‌పేయి కల నదుల అనుసంధానం అని.. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మరింత దృష్టి పెట్టారని అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో.. రాష్ట్రం లో ఉన్నా అది సాధ్యం కాలేదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాల చొరవ వల్లనే ఇది సాధ్యం అయిందన్నారు. ఎట్టకేలకు బీజేపీ మహా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దాహార్తి, నీటి సమస్య పై సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఖ్యాతి మహారాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలను దృష్టిలో పెట్టుకున్న గొప్ప సీఎం గా ఫడ్నవీస్ నిలుస్తారని ఆయన కొనియాడారు. గోదావరి నదిపై బర్రాజ్ నిర్మాణం ఒప్పందానికి రావడం శుభపరిణామంగా అభిప్రాయపడ్డారు. ఇలా పరిష్కరిస్తే దేశం బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం పై త్వరితగతిన తీసుకోవాలని కోరుతున్నాం.. ఈ ప్రాజెక్టులపై కేంద్ర సహాయం కోసం బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు.మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ఒప్పందం చేసుకుందన్నారు. తెలంగాణ కి సముద్రం లేదు కాబట్టి గోదావరి పై రవాణా కోసం ఈ ప్రాజెక్టులు ఉపయోగ పడే విధంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్ ను కోరినట్టు చెప్పారు. పార్లమెంట్ లో జల రవాణా బిల్లు పాస్ అవుతుంది.. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో జల రవాణా కు ఉపయోగపడుతుందని అన్నారు. ఇది తెలంగాణ ప్రజల కలగా లక్ష్మణ్ అభివర్ణించారు. ఖ్యాతి తమ పార్టీకే రావాలని తమకు ఆలోచన లేదు.. కాని ముందు నుండే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రులు హన్స్‌రాజ్ ఆహిర్, బండారు దత్తాత్రేయ చొరవ వల్ల ఈ ఒప్పందాలు సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే లక్ష్మణ్ తెలిపారు. -
'మహిళల భద్రత కోసమే సురక్ష బీమా'
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): మహిళలకు సామాజిక భద్రత కల్పించేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాఖీ పౌర్ణమి సందర్భంగా సురక్ష బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని బీజేపీ శాసనసభా పక్షనేత కె.లక్ష్మణ్ అన్నారు. ఆ పథకంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో 5 వేల మంది మహిళలకు బీమా కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద సురక్ష బీమా పథకాన్ని లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలతో రాఖీలు కట్టించుకొని వారికి పథకాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయ్యాక అనేక సామాజిక భద్రత పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. -
నన్ను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదు
నల్లగొండ : ‘నేను మతత్వ వాదిని కాదు.. సెక్యులర్ వాదిని.. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని.. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశా.. పార్టీలకతీతంగా పనిచేస్తున్నా.. ఎన్నికలప్పుడు పార్టీలు.. ఆ తర్వాత కార్యక్రమం అంతా కూడా అభివృద్ధి పైనే’ అని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల బీజేపీ నాయకులు జిల్లా పర్యటనలో భాగంగా పార్లమెంట్ సమావేశాలను కాంగ్రెస్ సభ్యులు అడ్డుకుంటున్నారని.. ఎంపీ గుత్తా అభివృద్ధి చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ చేసిన విమర్శలపై గుత్తా ఫైర్ అయ్యారు. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. జిల్లా బీజేపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. 2009 ఎన్నికల్లో తన పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారనే సంగతి విస్మరించరాదన్నారు. తన మీద మాట్లాడే వారిని ప్రజలే అసహ్యించుకుంటున్నారన్నారు. ఎంపీగా ఇన్నేళ్ల పదవీ కాలంలో జిల్లాకు సంబంధించినంత వరకు కోట్ల రూపాయాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. 15వ లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీగా ఉండి కూడా తెలంగాణ సాధన కోసం పార్టీకి వ్యతిరేకంగా తన గొంతు వినిపించి రెండు సార్లు సస్పెండ్ అయిన సంగతి బీజేపీ నేతలుమరిచి పోరాదన్నారు. 14 మాసాల కాలంలో బీజేసీ చేసింది ఏమిటి..? మాటలు తప్ప చేతల్లేవు.. ? ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటిస్తూ దేశాభివృద్ధి గురించి పట్టించుకోవడం మానేశారన్నారు. సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మునాసు వెంకన్న, మాజీ జెడ్పీటీసీ కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలి: డా. లక్ష్మణ్
కవాడిగూడ (హైదరాబాద్ సిటీ) : నిరుద్యోగ యువతీ యువకులంతా ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా తమ స్వశక్తితో స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించి నిలదొక్కుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. కవాడిగూడ డివిజన్ ఎస్బీఐ కాలనీలో పింటు, టింకు, రాజేష్‌లు నూతనంగా ఏర్పాటు చేసుకున్న శ్రీ మోహన్స్ ఛాట్ బండార్ దుకాణాన్ని ఎమ్మెల్యే లక్ష్మణ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారంతా కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా తమకిష్ఠమైన రంగంలో కానీ, ఇతర వ్యాపార రంగాల్లో స్థిపరపడేలా ఆలోచనలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్ రామ్, అశోక్‌కుమర్, సీహెచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
'సర్కార్ దిగిరాకుంటే సొంతంగా పోరాడుతాం'
హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ కార్మికులతో చర్చించేందుకు కేసీఆర్ భేషజాలకు పోరాదని అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను దేవుళ్లన్న కేసీఆర్.. వారి డిమాండ్లను ఎందుకు తీర్చడం లేదని ప్రశ్నించారు. అధికారులు సమ్మెను విఫలం చేయడానికి ప్రయత్నించకుండా వారి సమస్యను పరిష్కరించి రంజాన్ లోపు సమ్మెను విరమింపజేయాలని కోరారు. కార్మికుల డిమండ్ విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే పారిశుద్ధ్య కార్మికులకు అండగా బీజేపీ సొంతంగా పోరాటం చేస్తుందని చెప్పారు. -
'కేసీఆర్..దిగజారుడు రాజకీయాలు మానుకో'
సాక్షి, హైదరాబాద్:ముఖ్యమంత్రి కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే డా.కె. లక్ష్మణ్ ఆరోపించారు. లాల్‌బహదూర్ స్టేడియంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పటిష్టతకు పోతోందని, ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించకుండా పార్టీలోకి తీసుకుంటూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. టీఆర్ఎస్కు ముగ్గురు ఎమ్మెల్సీలను గెలిచే అవకాశం ఉంటే ఐదు మందిని బరిలో పెట్టి ఏం సంకేతాలు ఇవ్వదలుచుకుందని ప్రశ్నించారు. నైతిక విలువలు పూర్తిగా దిగజారే విధంగా వ్యవహరించడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలే మిగులుతాయని సీఎం స్వయంగా అనడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అధికారం శాశ్వతం కాదని, తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ కూటమి అభ్యర్థి గెలుస్తాడనే నమ్మకం తమకుందని పేర్కొన్నారు.