మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు.
హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ కార్మికులతో చర్చించేందుకు కేసీఆర్ భేషజాలకు పోరాదని అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను దేవుళ్లన్న కేసీఆర్.. వారి డిమాండ్లను ఎందుకు తీర్చడం లేదని ప్రశ్నించారు.
అధికారులు సమ్మెను విఫలం చేయడానికి ప్రయత్నించకుండా వారి సమస్యను పరిష్కరించి రంజాన్ లోపు సమ్మెను విరమింపజేయాలని కోరారు. కార్మికుల డిమండ్ విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే పారిశుద్ధ్య కార్మికులకు అండగా బీజేపీ సొంతంగా పోరాటం చేస్తుందని చెప్పారు.