
‘కాకా’కు కన్నీటి వీడ్కోలు
రాజకీయ భీష్ముడు, దళిత బాంధవుడు, కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామికి మంగళవారం భాగ్యనగరం కన్నీటి వీడ్కోలు పలికింది. కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల నేతలు, అభిమానులు, కార్మిక సంఘాల నాయకులు సోమాజిగూడలోని కాకా ఇంటికి తరలివచ్చి చివరిసారిగా అభిమాన నేత పార్ధివదేహం వద్ద నివాళులర్పించారు.
ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తరలించారు. సాయంత్రం పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.
హైదరాబాద్