రాష్ట్రంలో శిల్పాశెట్టి సెల్‌ఫోన్ పరిశ్రమ | Shilpa Shetty Cellphone Industry in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో శిల్పాశెట్టి సెల్‌ఫోన్ పరిశ్రమ

Published Tue, Feb 16 2016 7:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

రాష్ట్రంలో శిల్పాశెట్టి సెల్‌ఫోన్ పరిశ్రమ

రాష్ట్రంలో శిల్పాశెట్టి సెల్‌ఫోన్ పరిశ్రమ

‘మేక్ ఇన్ ఇండియా’లో తెలంగాణ స్టాల్ సందర్శించిన శిల్ప  

 సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భాగస్వామిగా ఉన్న హెచ్‌ఎస్‌జీఐ తెలంగాణలో సెల్‌ఫోన్ తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 13 నుంచి ముంబైలో జరుగుతున్న మేక్ ఇన్ ఇండియా వీక్‌లో భాగంగా.. తెలంగాణ పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ను శిల్పాశెట్టి దంపతులు సందర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే మైక్రోమాక్స్, సెల్‌కాన్ కంపెనీలు మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేశాయి.

అదే కోవలో తమ హెచ్‌ఎస్‌జీఐ ద్వారా తెలంగాణలో ‘వియాన్’ బ్రాండ్ పేరిట సెల్‌ఫోన్ల తయారీ పరిశ్రమ స్థాపనకు వారు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రాథమిక స్థాయిలో సంప్రదింపులు జరిగాయని.. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. శిల్పాశెట్టి తన భర్త రాజ్‌కుంద్రాతో కలసి గత ఏడాది హిందుస్థాన్ సేఫ్టీ గ్లాస్ ఇండస్ట్రీస్ ద్వారా.. వారి కుమారుడు ‘వివాన్’ పేరిట సెల్‌ఫోన్ల తయారీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా.. తెలంగాణ స్టాల్‌లో టీఎస్‌ఐపాస్ ప్రతులను వివిధ దేశాలు, రాష్ట్రాల పరిశ్రమల ప్రతినిధులు పెద్దఎత్తున తీసుకెళ్తున్నార న్నారని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement