బీసీ బిల్లు కోసం త్వరలో అత్యున్నత స్థాయి కమిటీ | Soon the high-level committee for the BC bill | Sakshi
Sakshi News home page

బీసీ బిల్లు కోసం త్వరలో అత్యున్నత స్థాయి కమిటీ

Published Mon, Feb 13 2017 3:39 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

బీసీ బిల్లు కోసం త్వరలో అత్యున్నత స్థాయి కమిటీ

బీసీ బిల్లు కోసం త్వరలో అత్యున్నత స్థాయి కమిటీ

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం పార్లమెంటులో ప్రత్యేకంగా బిల్లు ప్రవేశపెట్టేం దుకు త్వరలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆదివారం ఆయన నివాసంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, ప్రతినిధులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, నందకిశోర్, నర్సింహ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ సంఘ ప్రతినిధులు పలు డిమాండ్లు వినిపించారు.

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్‌ సంస్థల్లోనూ రిజర్వేష న్లను 50 శాతానికి పెంచాలని, బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించేందుకు బీసీ యాక్టును తీసుకురావాల న్నారు. ఈ డిమాండ్లపై అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement