ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలి: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగంలోని విద్యావ్యవస్థను పరిరక్షించాలని సీపీఎం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరిచి ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టాలని కోరింది. గురువారం ఎంబీ భవన్‌లో బి.వెంకట్ అధ్యక్షతన సీపీఎం రాష్ట్రస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి స్కూళ్లు ప్రారంభవుతున్నా ఉపాధ్యాయ పోస్టులపై నోటిఫికేషన్ విడుదల కాకపోవడం సరికాదన్నారు. ప్రైవేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని ప్రజాసంఘాలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.