సైబర్‌స్పేస్ పోలీసింగ్‌పై సర్కారు దృష్టి
అశ్లీల వెబ్‌సైట్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సైబర్‌స్పేస్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టింది. యువతను నిర్వీర్యం చేస్తూ మహిళలపై అకృత్యాలకు పరోక్షంగా కారణమవుతున్న అశ్లీల వెబ్‌సైట్లకు అడ్డుకట్ట వేసేందుకు సైబర్ క్రైం విభాగం రంగంలోకి దిగింది. రాష్ట్రంలో మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పూనం మాల కొండయ్య నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ... అశ్లీల వెబ్‌సైట్లను నిషేదించాలని ప్రభుత్వానికి ఇటీవలే ప్రాథమిక నివేదిక ఇచ్చింది.
దీనిపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ 26 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ)తో సమావేశమయ్యారు. ఐఎస్‌పీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ్ నేతృత్వంలో ఏర్పాటైన బృందం 5,000 అశ్లీల వెబ్‌సైట్లను గుర్తించింది. 1,400 బేస్ సైట్లపై ఐటీ చట్టం-2000లోని 69 (ఏ) సెక్షన్ కింద కేసులు నమోదు చేసింది. ఈ మేరకు సీఐడీ చార్జిషీట్లు కూడా దాఖలు చేసి కోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తోంది. ఆదేశాలు రాగానే వెబ్‌సైట్ల వివరాలను కేంద్రానికి పంపనుంది.