♦ పది తర్వాత పెరుగుతున్న డ్రాపౌట్స్
♦ 20 గురుకుల, 16 జూనియర్ కాలేజీల అప్‌గ్రేడ్ ప్రతిపాదన పెండింగ్
♦ ప్రస్తుతమున్నవి మూడు జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజే
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలకు 250 గురుకులాలు ఇచ్చారు.. మంచిదే కానీ, మరి తమ సంగతేమిటని బీసీ వ ర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీల ఏర్పాటు అంశం చర్చనీయాంశమైంది. ఇతర అణగారిన వర్గాల కోసం గురుకులాలను ప్రకటించి, బీసీలకు మాత్రం ఒక్కటి కూడా ప్రకటించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ర్టం లోని పది జిల్లాల్లో ప్రస్తుతం 23 రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. బీసీలకు పదో తరగతి తర్వాత రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యను కొనసాగించేందుకు కేవలం మూడే జూనియర్ కాలేజీలు, మహిళలకు ఒకే డిగ్రీ కాలేజీ ఉన్నాయి. ఈ కారణంతో జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బీసీ విద్యార్థులు పదో తరగతి తర్వాత చదువు మానేసి చిన్నా, చితకా పనులు చే సుకుంటున్నట్లు పలు పరిశీలనల్లో వెల్లడైంది.
ప్రభుత్వం వద్ద పెండింగ్ ప్రతిపాదనలు
రాష్ర్ట వ్యాప్తంగా 20 బీసీ గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న 16 పాఠశాలలను జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా జిల్లాల వారీగా గురుకులాల ఏర్పాటు చేయాలని అధికారులు గుర్తిం చారు. అయితే తాజాగా సీఎం ప్రకటించిన 250 గురుకులాల్లో బీసీ గురుకులాలు లేకపోవడం పట్ల ఈ వర్గాల్లో నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి.
బీసీ విద్యార్థులకు దొరకని చేయూత
Published Wed, Apr 20 2016 3:21 AM | Last Updated on Sat, Sep 15 2018 3:59 PM
Advertisement
Advertisement