చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: గట్టు | t ysrcp president gattu srikanth reddy fires on rtc, electricity charges increasing | Sakshi
Sakshi News home page

చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: గట్టు

Published Thu, Jun 23 2016 10:24 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: గట్టు - Sakshi

చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: గట్టు

హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తక్షణమే ఉపసంహరించుకోవాలని టీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో గురువారం ఆయన మాట్లాడుతూ...ప్రజలపై భారం మోపే కార్యక్రమాలకు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టడం దారుణమన్నారు.

ఇప్పటికే విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంద యూనిట్ల కంటే ఎక్కువ వాడే గృహ వినియోగదారులకు చార్జీల పెంపు, ఆర్టీసీలో 30 కి.మీ.పైన ఎంత దూరమైనా రూ.2 పెంచడంతో పాటు మిగతా బస్సుల్లో పది శాతం మేర చార్జీలు పెంచనుంది. దీనిపై గురువారం అధికారక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement