'ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు' | talasani srinivas yadav slams congress, tdp | Sakshi
Sakshi News home page

'ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు'

Published Thu, Aug 6 2015 1:47 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

'ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు'

'ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు'

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు. అభివృద్ధిలో ఒక్క అడుగు ముందుకు పడకుండా ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని ఆయన గురువారమిక్కడ ఆరోపించారు. విపక్షాల ఆరోపణలపై అసెంబ్లీ వేదికగా సమాధానం చెబుతామని తలసాని స్పష్టం చేశారు.

అవినీతికి అలవాటు పడిన పార్టీలు ఇప్పుడే అదే దృష్టితో చూస్తున్నాయని, ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్ల అవినీతిలో ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదన్నారు. గతంలో ఉస్మానియా ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడని పార్టీలు, వ్యక్తులు...ప్రస్తుతం తమ యత్నాలు అడ్డుకోవాలని చూస్తున్నారని తలసాని మండిపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement