నోముల పార్టీ వీడడం బాధాకరం: తమ్మినేని | Tammineni Veerabhadram Comments on Nomula Narsimhaiah Resigns To CPM | Sakshi
Sakshi News home page

నోముల పార్టీ వీడడం బాధాకరం: తమ్మినేని

Published Tue, Apr 8 2014 2:49 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

నోముల పార్టీ వీడడం బాధాకరం: తమ్మినేని - Sakshi

నోముల పార్టీ వీడడం బాధాకరం: తమ్మినేని

తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని తెలంగాణ రాష్ట్ర సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. ఇప్పటికి 38 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాలు ఖరారు చేసినట్లు తెలిపారు. మరో మూడు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఖరారు చేయనున్నట్లు చెప్పారు. నోముల నర్సింహయ్య పార్టీ వీడడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

 

నోముల సీపీఎం పార్టీతో ఉన్న అనుబంధాన్ని తమ్మినేని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.  తమ పార్టీ అభివృద్ధి ప్రణాళిక ఈ నెల13 లేదా 14న ప్రకటిస్తామన్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం నోముల నర్సింహయ్య తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement