
ఇబ్రహీంపట్నం: దేశ, రాష్ట్ర రాజకీ యాలు శరవేగంగా మారుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీర భద్రం అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహతోపాటు పలువురు ఆదివారం తమ్మినేని సమక్షంలో సీపీ ఎంలో చేరారు. ఆయన మాట్లాడుతూ 2018 చివరన సాధారణ ఎన్నికలు వస్తాయన్నారు.
టీఆర్‌ఎస్ తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు కులాలు, వర్గాల వారీగా పిలిపించుకొని సీఎం వరాల జల్లులను కురిపిస్తున్నారన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేక తను సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుందన్నారు. బీజేపీ ప్రభావం దేశంలో తగ్గిందని.. గుజరాత్‌లో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తుందన్నారు. పేదల కష్టాలు పోవాలంటే అట్టడుగు వర్గాల వారంతా ఐక్య సంఘటనగా ఒకే వేదికపైకి రావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment