హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ శనివారం మధ్యాహ్నం సమావేశమైంది. ఈ సందర్భంగా కేబినెట్ సమావేశంలో పలు అంశాల గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, నష్టపరిహారంపై కేబినెట్లో చర్చించారు. వరంగల్ జిల్లా ములుగులో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అదే విధంగా అనాథలను బీసీ 'ఏ' కేటగిరీలో చేరుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పలు శాఖల్లో కొత్తగా పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో పట్టణాభివృద్ధి అధ్యయనం కోసం అధికారుల బృందాన్ని చైనాకు పంపాలని.. దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కోసం అధికారుల బృందం చైనాలో పర్యటించనుంది.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించారు. కేబినెట్ సమావేశం దాదాపు నాలుగు గంటలకు పైగా కొనసాగింది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతోనే రైతుల వ్యవహారం కేబినెట్ దృష్టికి వచ్చింది. కల్తీ కల్లుతో ఆస్పత్రుల బారిన పడుతున్న వారిని దృష్టిలో ఉంచుకుని కొత్త ఎక్సైజ్ విధానాన్ని తెస్తున్నామని టీ సర్కార్ తెలిపింది.
వ్యవసాయ శాఖ విభాగంలో నియామకాలు చేపడతామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన ట్వీట్ చేశారు. అగ్రి ఎక్స్టెన్షన్కు సంబంధించి 1000, అగ్రోనామిస్ట్లు 438 ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
బీసీ 'ఏ' కేటగిరిలోకి అనాథలు: టీ-సర్కార్
Published Sat, Sep 19 2015 3:50 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM
Advertisement
Advertisement