హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను కలిశారు. రాజ్భవన్లో ఈ భేటీ జరిగింది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి విచ్చేసిన జస్టిస్ ఠాకూర్ను కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు విభజనతో పాటు పలు న్యాయపర అంశాలపై ఇరువురూ చర్చించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న న్యాయపర సమస్యలకు త్వరలోనే పరిష్కార మార్గం చూపాలని కేసీఆర్ కోరారు.
నల్సార్ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం సందర్భంగా 45మంది న్యాయ విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, డిప్లమాలో ఉత్తీర్ణులైన 536మంది విద్యార్థులకు పట్టాలు అందచేశారు. చీఫ్ జస్టిస్ ఠాకూర్తో పాటు ఏపీ, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ రమేష్ రంగనాథ్, నల్సార్ వర్శిటీ వీసీ ప్రొఫెసర్ ముస్తఫా, రిజిస్ట్రార్ బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు సీజేను కలిసిన కేసీఆర్
Published Sat, Aug 6 2016 7:26 PM | Last Updated on Sun, Sep 2 2018 5:48 PM
Advertisement
Advertisement