'కేసీఆర్ ఢిల్లీ పర్యటన విజయవంతం'
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పర్యటన విజయవంతమైందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ తాము ఎన్డీయేలో చేరుతామని వస్తున్న వార్తలు కేవలం ప్రచారమేనని కొట్టిపారేశారు. కాగా ఎన్డీయేకు అంశాలవారీగా తమ మద్దతు కొనసాగుతుందని వేణుగోపాలాచారి పేర్కొన్నారు.
అయితే తెలంగాణ రాష్ట్ర సమస్యల విషయంలోనూ, అలాగే ప్రజల ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా ప్రభుత్వ చర్యలుంటే వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.