తెలంగాణ వెలిగిపోతోంది: కేటీఆర్
కుషాయిగూడ: రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేని ఎండాకాలాన్ని పరిచ యం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం చర్లపల్లి పారిశ్రామికవాడలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం, తెలంగాణ చిన్నతరహా, సూక్ష్మ పరిశ్రమల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘీభావ సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే రక్షణ ఉండ దు, పెట్టుబడులు రావు, కరెంటు ఉండదని పలువురు నాయకులు విష ప్రచారం చేశారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండేళ్లలో అలాంటిదేమైన జరిగిందా అని ప్రశ్నించారు.
తెలంగాణ లో చిమ్మచీకట్లు కమ్ముకుంటాయన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కిరణం ఆగిపోయిందని, తెలంగాణ మాత్రం వెలిగి పోతుందన్నారు. కార్మికుల కష్టాలు తెలిసిన నాయకునిగా అనేక సంక్షేమ కార్యక్రమా లు అమలు చేయడంతో పాటుగా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులతో ప్రైవేటురంగం లో 75 వేల మం దికి ఉపాధి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, గుండు సుధారాణి, ఎమ్మెల్యే కొండా సురేఖ, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిక:చర్లపల్లి డివిజన్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన ఆహ్వానించారు. ధన్‌పాల్‌రెడ్డి,శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, బొడిగె రాజు, తాళ్ల వెంకటేశ్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో ఉన్నారు.