టెంపుల్ సిటీ అద్భుతంగా ఉండాలి | Temple City should be awesome | Sakshi
Sakshi News home page

టెంపుల్ సిటీ అద్భుతంగా ఉండాలి

Published Wed, Sep 7 2016 12:44 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

టెంపుల్ సిటీ అద్భుతంగా ఉండాలి - Sakshi

టెంపుల్ సిటీ అద్భుతంగా ఉండాలి

- యాదాద్రి నిర్మాణ పనులు, డిజైన్లపై అధికారులతో సీఎం సమీక్ష
- కాటేజీల నిర్మాణానికి ముందుకొచ్చిన సింగరేణి, జెన్‌కో
- ఆ సంస్థలకు సరిపడా స్థలం కేటాయించాలని ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్: యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, రాబోయే కాలంలో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రధానాలయానికి అభిముఖంగా గుట్టలతో కూడుకున్న ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన లే అవుట్లు, డిజైన్లను సీఎం పరిశీలించారు. టెంపుల్ సిటీని 850 ఎకరాల విశాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇందులో కాటేజీలు, విశాలమైన రోడ్లు, పార్కింగ్, ఉద్యానవనాలు, ఫుట్‌పాత్‌లు, ఫుడ్ కోర్టులు, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో 250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టాల్సిన పనుల డిజైన్లను ఖరారు చేశారు.

86 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 200 కాటేజీలు, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టు, ఏడెకరాల విస్తీర్ణంలో మంచినీరు. మురుగునీరు నిర్వహణ వ్యవస్థ, పన్నెండున్నర ఎకరాల్లో గ్రీనరీ, 68 ఎకరాల్లో రహదారులు, 26 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, మరో 42 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారు. యాదాద్రి అభివృద్ధి పనులపై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, ఆలయ శిల్పులు ఆనందసాయి, ప్రవీణ్, ఇంజనీరింగ్ అధికారులు వెంకటేశ్వర్‌రెడ్డి, రమేశ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రిలో కాటేజీలు నిర్మించడానికి ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, జెన్‌కోలతోపాటు దేశవ్యాప్తంగా పలు కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయని, వారికి కేటాయించేందుకు వీలుగా 1,000 చదరపు గజాల నుంచి 1,500 గజాల ఓపెన్ ప్లాట్లను సిద్ధం చేయాలని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. కాటేజీలు నిర్మించే ప్రాంతంలో రహదారులు, మురుగునీరు, విద్యుత్, మంచినీరు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రధాన ఆలయానికి వెళ్లడానికి, తిరిగి రావడానికి రెండు వేర్వేరు రహదారులు నిర్మించాలని ఆదేశించారు. భక్తులను గుట్టపైకి తీసుకెళ్లడానికి ఆలయం తరఫునే ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించే యోచన ఉందని సీఎం వెల్లడించారు. గుట్టపైన నిర్మాణాలు పూర్తయిన తర్వాత నిర్వహణ బాధ్యతలు చూసేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement