రీ డిజైన్ పనుల కేటాయింపుపై కసరత్తు | The allocation of work on Re-design works | Sakshi

రీ డిజైన్ పనుల కేటాయింపుపై కసరత్తు

Published Tue, Apr 5 2016 3:44 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

రీడిజైన్ చేసిన సాగునీటి ప్రాజెక్టుల పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యయ అంచనా పెరిగిన నేపథ్యం లో పనులను పాత కాంట్రాక్టర్లకు

సాగునీటి ప్రాజెక్టులపై నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ
 
 సాక్షి, హైదరాబాద్: రీడిజైన్ చేసిన సాగునీటి ప్రాజెక్టుల పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యయ అంచనా పెరిగిన నేపథ్యం లో పనులను పాత కాంట్రాక్టర్లకు అప్పగించా లా, వద్దా.. అని తర్జనభర్జన పడుతోంది. అదనపు పనులను యథావిధిగా పాత కాంట్రాక్టర్లకే అప్పగించాలన్న ఇదివరకటి నిర్ణయంపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం మరోమారు సమీక్షించనుంది.కాళేశ్వరం, ప్రాణహిత, దేవాదుల ఫేజ్-3, తుపాకులగూడెం ప్రాజెక్టుల అంచనాల్లో మార్పులు, పెరుగుతున్న వ్యయ భారాలు, ఇప్పటి స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల (ఎస్‌ఎస్‌ఆర్)పై చర్చించనుంది.

 నాలుగు ప్రాజెక్టులే కీలకం...
 ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భా గంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల అంచనా వ్యయం రూ.38,500 కోట్ల నుంచి ఏకంగా రూ.83 వేల కోట్లకు చేరింది. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు ఫేజ్-3 పనుల పాత అంచనా రూ.531 కోట్లు ఉండగా సవరణతో రూ.1349 కోట్లకు చేరింది. తుపాకులగూడెం బ్యారేజీకి రూ.3155 కోట్లతో అంచనాలు సిద్ధమయ్యా యి. దేవాదుల కింద నిర్ణయించిన ఆయకట్టులోంచి 1.90 లక్షల ఎకరాలను వరదకాల్వలోకి మార్చనున్నారు. వరదకాల్వ కిందకు తెస్తున్న ఆయకట్టుకు నీరిచ్చేందుకు కొత్తగా టన్నెల్, కాల్వలను తవ్వడానికి సుమారు రూ.2,563 కోట్ల మేర అదనంగా అవసరం అవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు తేల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement