తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆవిర్భావం
చైర్మన్‌గా భానుమూర్తి ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల బ్రాహ్మణ సంఘాలతో తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) ఆవిర్భవించింది. దీనికి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు గంగు భానుమూర్తి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం న్యూనల్లకుంటలోని శ్రీ సీతారామాంజనేయ సరస్వతి దేవాలయం ప్రాంగణంలో గంగు భానుమూర్తి అధ్యక్షతన తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆవిర్భావ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 58 మందితో కమిటీని ఏర్పాటు చేయ గా ఆ ప్రతినిధులు గంగు భానుమూర్తిని జేఏసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బండారు రామప్రసాద్, మహిళా ప్రతినిధిగా గీతామూర్తిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ భానుమూర్తి మాట్లాడుతూ తెలంగాణలోని బ్రాహ్మణులందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకే జేఏసీ ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ బ్రాహ్మణ పక్షపాతి అన్నారు. అందుకే ఆయన ఎంతో సహృదయంతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.100 కోట్ల బడ్జెట్ కేటారుుస్తాననడం ముదావహమన్నారు. పేద బ్రాహ్మణులకు కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయడంతోపాటు పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పేద బ్రాహ్మణులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం బర్కత్‌పురలోని అర్చక భవన్‌లో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర స్థారుు విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వొడితెల విశ్వనాథరావు, మాజీ వీసీ ధర్మేందర్ రావు, గంగు ఉపేంద్రశర్మలు మాట్లాడారు. అక్టోబర్ 16వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా పదివేల మంది బ్రాహ్మణ వధూవరుల కోసం ‘కల్యాణమస్తు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.