అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా గ్రేటర్ అధికారులు ఐదంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు. టోలిచౌకి ప్రాంతం బృందావన్ కాలనీలో ఒక ఐదంతస్తుల భవనాన్ని ఆక్రమిత స్థలంలో నిర్మించినట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు అక్కడికి జేసీబీలతో చేరుకున్నారు. ఆ భవనాన్ని నేలమట్టం చేయటంపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకుని, అధికారులతో వాగ్వాదానికి దిగారు. భవనం కూల్చివేతను ఆపాలని గట్టిగా కోరారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే, అధికారులు ససేమిరా మాట వినకపోవటంతో అక్కడి నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు. సిబ్బంది కూల్చివేతను కొనసాగిస్తున్నారు.
ఐదంతస్తుల అక్రమకట్టడం కూల్చివేత
Published Thu, Sep 29 2016 2:10 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement