స్థిరాస్తికి అస్థిరత!! | The volatility of prop | Sakshi
Sakshi News home page

స్థిరాస్తికి అస్థిరత!!

Published Wed, Nov 9 2016 4:35 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

స్థిరాస్తికి అస్థిరత!! - Sakshi

స్థిరాస్తికి అస్థిరత!!

తాత్కాలికంగా ధరలపై తీవ్ర ప్రభావం!
- దీర్ఘకాలంలో పారదర్శకతకు అవకాశం  రీసేల్ ప్రాపర్టీకి, చిన్న బిల్డర్లకు దెబ్బే
- నివాస సముదాయాలకు డిమాండ్  మున్ముందు వాణిజ్య రియల్టీలోకి పెట్టుబడులు  
 
 నల్లధన ప్రవాహం ఎక్కువగా ఉండే రంగాల్లో స్థిరాస్తి రంగం కూడా ఒకటి. దీన్నెవరూ కాదనలేరు. ఎందుకంటే ప్లాట్ల విషయానికి వచ్చినపుడు ప్రభుత్వం నిర్ణరుుంచిన ధరలకు, యజమానులు చెప్పే ధరలకు పొంతన ఉండదు. ఫ్లాట్ల సంగతి చూసినా... రిజిస్ట్రేషన్ విలువకు, చెల్లించాల్సిన విలువకు మధ్య తేడా చాలా ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.1,000, రూ.500 నోట్ల రద్దు దేశీయ స్థిరాస్తి రంగంలో తాత్కాలికంగా అస్థిరతకు దారి తీయవచ్చనేది నిపుణుల మాట. దీర్ఘకాలంలో మాత్రం నగదరహిత రూపంలో స్థిరాస్తి కొనుగోళ్లు పెరిగి పారదర్శకత నెలకొంటుందని, ఇది స్థిరాస్థి రంగ వృద్ధికి ఉపకరిస్తుందనేది వారి అభిప్రాయం. కేంద్రం తాజా నిర్ణయంతో వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వెల్లడవుతుందన్నది భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) అభిప్రాయం. నోట్ల రద్దు కారణంగా అన్ని రంగాల్లోనూ పారదర్శకత నెలకొని ప్రభుత్వం ఆదాయం పెరుగుతుందని, దీంతో జీడీపీ 20-30 శాతం పెరిగే అవకాశముంటుందని సమాఖ్య చెబుతోంది.    
 - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
 
 కొనుగోలు నిర్ణయాలు పెరుగుతాయ్..
 దశాబ్ద కాలం నుంచే దేశంలో ప్రాపర్టీ లావాదేవీలు నగదు రూపంలో కాక బ్యాంకు చెక్‌ల రూపంలో జరుగుతున్నారుు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రభావం స్థిరాస్తి సంస్థలపై పడకపోరుునా.. స్థిరాస్తి కొనుగోలుదారులపై తప్పకుండా ఉంటుందని గిరిధారి కన్‌స్ట్రక్షన్‌‌స ఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు రియల్టీ కొనుగోళ్ల నిర్ణయంలో మీమాంసలో ఉన్నవాళ్లు ఈ దెబ్బతో తక్షణమే నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రముఖ నగరాల్లో స్థిరాస్తి కొనుగోళ్లు ఎక్కువ సంఖ్యలో జరిగే అవకాశముంది. ఎందుకంటే ఇప్పటికే చేతిలో ఉన్న రూ.1,000, రూ.500 నోట్లతో ప్రాపర్టీ కొనుగోళ్లు పూర్తి చేసేస్తారని, లేకపోతే ఆ తర్వాత బ్యాంకులు, పోస్టాఫీసులకు చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకునే బదులు ప్రాపర్టీ కొనుగోళ్లే మేలనుకునే కస్టమర్లూ ఉంటారని వారు చెప్పారు.
 
 పలు బిల్లులతో ఇప్పటికే పారదర్శకత!
 నోట్ల రద్దుతో పాటూ కేంద్రం ఇప్పటికే తీసుకొచ్చిన పలు రియల్టీ బిల్లులు కూడా ఈ రంగంలో పారదర్శకతకు దోహదం చేశాయని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ బిల్లు-2016, ల్యాండ్ ఆక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ యాక్ట్ వంటి పలు చట్టాలతో స్థిరాస్తి రంగంలో పారదర్శకత నెలకొంది. చాలా సంస్థలు తమ వెబ్‌సైట్లలో ప్రాజెక్ట్‌లు,  ప్రాపర్టీ వివరాలు, లావాదేవీలు, కస్టమర్ల అభిప్రాయాలు ఆయా సంస్థ వెబ్‌సైట్లలో ప్రదర్శించేస్తున్నారు కూడా. ఇప్పటికే చాలా మంది డెవలపర్లు/బిల్డర్లు ఫ్లాట్ బిల్టప్ ఏరియా, మార్కెట్ విలువలకు అనుగుణంగా లావాదేవీలు జరుపుతున్నారు.
 
 చిన్న బిల్డర్లపై ప్రభావం
 అరుుతే కేంద్రం తాజా నిర్ణయం దేశంలోని చిన్న, మధ్య తరహా బిల్డర్లు, అసంఘటితంగా ఉన్న డెవలపర్ల మీద ప్రభావం చూపిస్తుందని క్రెడాయ్ మాజీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ‘‘నగదు రూపంలో స్థిరాస్తి లావాదేవీలు జరిపే బిల్డర్లు/ డెవలపర్లకు మాత్రం ఇబ్బంది ఉంటుంది. పెద్ద బిల్డర్లు, లిస్టెడ్ కంపెనీలు మాత్రమే మార్కెట్లో నిలదొక్కుకోగలుగుతారుు. నగదు ఒత్తిళ్లు కారణంగా నివాస సముదాయాలకు డిమాండ్ పెరుగుతుంది. ధరలు కూడా తగ్గే అవకాశముంది’’ అని డీఎల్‌ఎఫ్ సీఈఓ రాజీవ్ తల్వార్ చెప్పారు. దీంతో దేశంలోని రీసేల్ ప్రాపర్టీల అమ్మకాలు దెబ్బతింటాయని చెప్పారాయన. నగదు రహిత లావాదేవీల వైపు దేశం పయనిస్తుందని, ఇది ఆర్థిక పరిపుష్టికి సంకేతంగా నిలుస్తుందని చెప్పారు. ‘‘నల్లధనంతో స్థిరాస్తి కొనుగోళ్లు జరపటమనేది ఎక్కువగా నివాస, వాణిజ్య సముదాయాల్లో కంటే భూమి కొనుగోళ్లలోనే ఉంటుంది. అరుుతే గత 6-7 ఏళ్ల నుంచి దేశంలో పెద్ద ఎత్తున భూమి కొనుగోళ్లు జరగటం లేదు. దీనర్థం స్థిరాస్తి రంగంలో నల్లధనం ప్రవాహం పెద్దగా లేదనే. ఇప్పటికే దేశంలోని పెద్ద బిల్డర్లు, సంఘటిత స్థిరాస్తి సంస్థలు స్థిరాస్తి కొనుగోళ్లను బ్యాంకు చానళ్ల ద్వారానే నిర్వహిస్తున్నారుు’’ అని తల్వార్ వివరించారు.
 
 పెట్టుబడులొస్తాయ్..
 ఇన్నాళ్లు స్థిరాస్తి రంగంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో (ఎఫ్‌డీఐ) ఐటీ/ఐటీఈఎస్, హెచ్‌ఎన్‌ఐ కస్టమర్ల కోసం ప్రాజెక్ట్‌లు చేసే స్థిరాస్తి సంస్థలు కాస్తా ఇకపై అందుబాటు ధరల్లోనూ ప్రాజెక్ట్‌లను చేసే అవకాశముంది. దీంతో నివాస సముదాయాలకూ డిమాండ్ పెరుగుతుంది. బ్యాంకులు కూడా రుణాల మంజూరులో కనికరం చూపిస్తే సామాన్యులకూ సొంతింటి కల అందుబాటులోకి వస్తుందని రాజీవ్ తల్వార్ వివరించారు. మరోవైపు నల్లధనం కట్టడి చేసిన ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా దేశ ర్యాంకింగ్ కూడా మెరుగవుతుంది. తద్వారా విదేశీ పెట్టుబడిదారులు నమ్మకం పెరుగుతుంది. దేశానికి పెట్టుబడులు వస్తారుు.
 
► పెద్ద సంఖ్యలో నగదు రూపంలో నల్లధనాన్ని నిల్వ చేసిన వారికి ఇది శరాఘాతం.
► స్వచ్ఛంద నల్లధన వెల్లడికి ప్రభుత్వం ప్రకటించిన గడువు ముగిసింది కాబట్టి వీరు ఈ డబ్బును వెల్లడించలేరు.
► అధికారికంగా బ్యాంకుల్లో నల్లధనాన్ని డిపాజిట్ చేయలేరు. ఒకవేళ చేస్తే ఆదాయపు పన్ను శాఖతో బ్యాంకులు సమాచారాన్ని పంచుకుంటారుు కాబట్టి... డబ్బు ఎలా వచ్చిందో చెప్పాల్సి ఉంటుంది.
► ఎలాంటి సంకేతాలు లేకుండా... ఆకస్మాత్తుగా ప్రకటించడం ద్వారా ప్రభుత్వం నల్ల కుబేరులను గట్టిదెబ్బే కొట్టగలిగింది.
► అరుుతే విదేశీ బ్యాంకుల్లో ఇప్పటికే నల్లధనాన్ని దాచిన వారికి వచ్చే నష్టమేమీ లేదు.
► భారత్‌లో నగదు రూపంలో తమ వద్ద నల్ల ధనాన్ని అట్టిపెట్టుకున్న వారికే ఇబ్బంది.
► ఎన్నికల కోసం నగదు (నల్లధనమే) నిల్వ చేసుకున్న రాజకీయ పార్టీలకు, నాయకులకూ గొంతులో వెలక్కాయపడ్డట్టే.
► ఇకమీదట బంగారం లేదా ఇతర విలువైన లోహాలు, స్థలాల రూపంలో నల్లధనం ఎక్కువగా పోగవుతుంది.
► దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపర్చడానికి నకి లీ కరెన్సీని చలామణి చేస్తున్న తీవ్రవాదు లు, పొరుగుదేశాలకు చెక్ పెట్టినట్లరుుంది.
► పాత నోట్లు బ్యాంకుల్లో జమ చేసి కొత్తవి పొందాలంటే... లెక్క చెప్పాల్సిందే కాబట్టి అవినీతి సొమ్ము, అక్రమంగా పోగుపడిన నల్లధనాన్ని ‘వైట్‌మనీ’గా మార్చడం సాధ్యం కాదు.
► పాన్‌కార్డులు లేకుండా, ఖాతాలు లేకుండా నగదు రూపంలోనే నోట్లు మార్పిడి చేసుకునే వారు కూడా తగిన గుర్తింపు పత్రాలు  చూపాల్సి ఉంటుంది కాబట్టి... వీరు కూడా ఓ పరిమితిని దాటి నగదును కొత్త నోట్లుగా మార్చడం కష్టం. అలా చేస్తే ఆదాయపన్ను అధికారుల దృష్టిలో పడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement