ఇక సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే
♦ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నెలాఖరు కల్లా అందుబాటులోకి
♦ హెచ్‌ఎండీఏలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేయడంతోపాటు ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా.. దళారీ వ్యవస్థను నిర్మూలించే దిశగా పనిచేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జూన్ నెలాఖరు కల్లా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఆన్‌లైన్ సేవల్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.
భవన నిర్మాణ, లేఅవుట్లు, భూ బదలాయింపు తదితర సేవలన్నిం టినీ ఆన్‌లైన్ ద్వారా అందిస్తామన్నారు. హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ‘డెవలప్‌మెంట్ పర్మిషన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ను కేటీఆర్ బుధవారం ఆవిష్కరించారు. అవి నీతికి తావు లేకుండా భవనాల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని గ్రేటర్ ఎన్నికల సమయంలో ప్రజలకు సీఎం ఇచ్చి న హామీ మేరకు.. హెచ్‌ఎండీఏలో తొలుత ఆన్‌లైన్ సేవల్ని తీసుకొచ్చామని కేటీఆర్ చెప్పారు. ఇకపై వ్యక్తుల ప్రమేయం లేకుం డా దరఖాస్తు నుంచి అనుమతుల వరకు అన్నీ ఆన్‌లైన్ ద్వారా నిశ్చితంగా చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం అన్ని రకాల భవన నిర్మాణ, లేఅవుట్లు, భూ బదలాయింపు తదితర అనుమతులను పొందవచ్చని, మరో వారంలో ఎన్‌వోసీలను ఆన్‌లైన్ ద్వా రా అందజేస్తామన్నారు.
గతంలో మాదిరిగా కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే శ్రమ, వ్యయభారం పూర్తిగా తప్పుతుంద ని, కేవలం 30 రోజుల్లో అనుమతులు రావడమా?లేదా? అన్నది తేలుతుందని చెప్పా రు. అన్ని పత్రాలు సరిగా ఉన్నా అనుమతి దక్కకుంటే.. అప్పీల్ చేసే అవకాశం కల్పిం చామన్నారు. ఇదే స్ఫూర్తితో తొలుత జీహెచ్‌ఎంసీలో ఆన్‌లైన్ సేవల్ని తీసుకొస్తామన్నారు. తర్వాత జూన్ నెలాఖరులోగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 73 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ప్రవేశపెడతామన్నారు. ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకు జీహెచ్‌ఎంసీలో ఏరియా కమిటీలు ఏర్పా టు చేస్తామన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో హెచ్‌ఎండీఏ ద్వారా ఆన్‌లైన్ సేవల్ని అమలు చేస్తుండటాన్ని గొప్ప ముందడుగన్నారు. రాబోయే రోజుల్లో మిగతా శాఖలను అనుసంధానం చేస్తూ ఇతర సేవల్ని అందుబాటులోకి తెస్తామన్నారు. వంద రోజుల ఎజెండాలో భా గంగా ఆన్‌లైన్ సేవల్ని తీసుకొచ్చినట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు తెలిపారు. మంత్రి పద్మారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.