సాక్షి, హైదరాబాద్: ఏఓబీ ఎన్‌కౌంటర్ కోవర్టుల కారణంగానే జరిగిందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టులను కలిసే వారి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. సోమవారం నాటి ఘటనా స్థలంలో ఆర్కే సహా మరికొందరు అగ్రనేతలు ఉన్నారని సమాచారం. ఒడిశా పోలీసులు కన్నెత్తి చూడని సురక్షిత ప్రాంతం కాబట్టే మావోయిస్టు అగ్రనేతలు, దళాలు అక్కడికి చేరుకున్నారని తెలుస్తోంది. పక్కా చిరునామా (పిన్ పాయింట్) దగ్గర ఉండి చూపేవారుంటేనే పోలీసులు అంత లోపలికి రావడం సాధ్యమంటున్నారు. కోవర్టుల సమాచారంతోనే పోలీసులు అక్కడికి వెళ్లగలిగారని అంటున్నారు.
మరోవైపు మావోయిస్టులు తిన్న ఆహారంలో విష ప్రయోగం జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఏటా నవంబర్, డిసెంబర్ మధ్య మావోయిస్టుల సమావేశాలు జరుగుతాయని, ఆ సమాచారంతోనే నిఘా పెట్టి ఉంటారని తెలుస్తోంది. ‘‘మావోయిస్టులు ఆ ప్రాం తాన్ని షెల్టర్ జోన్‌గా వాడుకుంటారు. పక్కా సమాచారంతోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది’’ అని గ్రేహౌండ్స్‌లో అనుభవమున్న ఓ పోలీసు అధికారి చెప్పారు.
కోవర్టుల పనే..?
Published Tue, Oct 25 2016 3:54 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
Advertisement