బడా ఖానా.. | This time it was exclusive to dog | Sakshi
Sakshi News home page

బడా ఖానా..

Published Fri, Oct 2 2015 12:35 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

బడా ఖానా.. - Sakshi

బడా ఖానా..

గణేష్ ఉత్సవాల వంటి భారీ ఘట్టాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు .....

ఈసారి జాగిలాలకు ప్రత్యేకం
 
గణేష్ ఉత్సవాల్లో స్నిఫర్ డాగ్స్‌పై పని భారం
11 రోజుల్లో 3,500 ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు
మూగజీవాల కష్టాన్ని గుర్తించిన సీపీ
‘బడా ఖానా’గా   రూ.5 వేల వంతున మంజూరు

 
గణేష్ ఉత్సవాల వంటి భారీ ఘట్టాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు తీవ్రంగా శ్రమించిన సిబ్బందికి ఉన్నతాధికారులు విందు ఇవ్వడం నగర పోలీసు కమిషనరేట్‌లో ఆనవాయితీ. దీన్ని పోలీసు పరిభాషలో ‘బడా ఖానా’ అంటారు. ఈసారి ఉత్సవాల్లో సేవలందించిన జాగిలాలకూ ‘బడా ఖానా’ వర్తింపజేశారు. వీటి కి పోషకాహారం అందించేందుకురూ.5 వేల వంతున అదనంగా మంజూరు చేశారు.
 
సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాలు... నిమజ్జనం... నగర పోలీసు విభాగానికి ఇంతకు మించిన భారీ ఘట్టం మరొకటి ఉండదని చెప్పవచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దీటుగా మొత్తం 11 రోజుల పాటు ఇవి నడుస్తాయి. ఆఖరి రోజు జరిగే సామూహిక నిమజ్జనం ఓ సవాలే. ఈనేపథ్యంలో నిరంతర భద్రత, బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బంది... పర్యవేక్షించే అధికారులు, పరిశీలించి మార్పుచేర్పులు సూచించే ఉన్నతాధికారులు.... వీరంతా పడే కష్టం మనందరికీ తెలిసిందే. మన కోసం...మన భద్రత కోసం పని చేస్తూ.. మన కళ్లలో పడినా పట్టించుకోనివీ ఉన్నాయి. అవే స్నిఫర్ డాగ్స్‌గా పిలిచే పోలీసు జాగిలాలు. గడిచిన పక్షం రోజులుగా నిరంతర విధులతో ఊపిరి సలపకుండా పని చేసిన వీటి కష్టాన్ని కొత్వాల్ గుర్తించారు. ‘అదనపు ప్రొత్సాహకాలు’ మంజూరు చేశారు.

సీఎస్‌డబ్ల్యూ ఆధీనంలో 30 జాగిలాలు...
నగర భద్రతా విభాగంగా పిలిచే సిటీ సెక్యూరిటీ వింగ్ (సీఎస్‌డబ్ల్యూ) ఆధీనంలోనే కెన్నల్ వింగ్ ఉంది. ప్రస్తుతం ఇందులో 30 స్నిఫర్ డాగ్స్ పని చేస్తున్నాయి. బాంబులతో పాటు ఇతర పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువులను వాసన చూడటం ద్వారా గుర్తించడంలో సుశిక్షితులైన వీటిలో 10 శునకాలు అనునిత్యం అత్యంత ప్రముఖుల భద్రతా విధుల్లో పని చేస్తుంటాయి. మిగిలిన 20 శునకాలూ నేర స్థలాలకు వె ళ్లి ఆధారాలు అందించడంతో పాటు నిత్యం తనిఖీల్లో సేవలందిస్తుంటాయి. సాధారణంగా ప్రతి జాగిలం 24 గంటలు విధులు నిర్వర్తించిన తరవాత మరో 24 గంటల పాటు విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలోనే కచ్చితంగా కొంత సమయం ప్రాక్టీసు కూడా చేస్తుంది.  
 
30 శాతం పని 11 రోజుల్లోనే...
సాధారణ రోజుల్లో సరాసరి రోజుకు 40 నుంచి 50 ప్రాంతాల్లో ఈ జాగిలాలు తమ హ్యాండ్లర్లతో కలిసి తనిఖీలు చేస్తుంటాయి. అత్యవసర సందర్భాల్లో తప్ప ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తుంటాయి. ఏడాదిలో ఈ జాగిలాలు దాదాపు 12 వేల ప్రాంతాల్లో తనిఖీలు చేయడం... నేర స్థలాలకు వెళ్లివస్తుంటాయి. ఒక్క గణేష్ ఉత్సవాల నేపథ్యంలో 11 రోజుల పాటు ఇవి మొత్తం 3,500 ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాయి. ఏడాదిలో చేసే పనిలో 30 శాతం ఈ 11 రోజుల్లోనే చేసినట్లయింది. సీఎస్‌డబ్ల్యూలో ఉన్న జాగిలాలకు సహకరించేందుకు ఇతర జిల్లాల నుంచి 17 తీసుకువచ్చి ఉత్సవాలు ముగిశాక పంపారు.
 
అదనపు నిధులు...
గణేష్ ఉత్సవాల వంటి భారీ ఘట్టాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఉన్నతాధికారులు తీవ్రంగా శ్రమించిన సిబ్బందికి విందు ఇవ్వడం నగర పోలీసు కమిషనరేట్‌లో ఆనవాయితీ. దీన్ని నగర పోలీసు పరిభాషలో ‘బడా ఖానా’ అంటారు. హ్యాండ్లర్లు మారినా నిరంతరాయంగా పని చేసిన జాగిలాల శ్రమను కొత్వాల్ మహేందర్‌రెడ్డి గుర్తించారు. ఒక్కో జాగిలం ఆహారానికి ప్రతి నెలా రూ.12 వేల వరకు మంజూరు చేస్తుంటారు. 11 రోజుల గణేష్ ఉత్సవాలు, ఆ తరవాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ నిర్వరామంగా పని చేస్తున్న పోలీసు జాగిలాలకు ఈ నెల అదనంగా మరో రూ.5 వేలు చొప్పున ఆయన మం జూరు చేశారు. ఈ నిధులతో  జాగిలాలకు కడెల్, పెట్‌గ్లో, ఫీ-ఫొలేట్ వంటి బలవర్థకమైన ప్రొటీన్డ్ ఫుడ్ అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement