
11 అడుగుల ఎత్తు నుంచి దూకిన కదంబ
హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ జూ పార్కులో శనివారం పెద్ద ప్రమాదం తప్పింది. కదంబ అనే రాయల్ బెంగాల్ టైగర్ 11 అడుగుల ఎత్తున్న ఎన్క్లోజర్ను దూకి బయటకు వచ్చిన ఘటన కలకలం రేపింది. ఒక్కసారిగా పులి బోనులో నుంచి తప్పించుకుని బయటకు రావటంతో సందర్శకులు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు. తేరుకుని సందర్శకులు భయంతో పరుగులు తీశారు.
ఎట్టకేలకు జూ సిబ్బంది పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు. పులిని ఒక ఎన్క్లోజర్ నుంచి మరో ఎన్క్లోజర్కు మారుస్తుండగా పెన్సింగ్ పై నుంచి దూకటంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇటీవలే అయిదేళ్ల వయసు గల ఈ పులిని మంగళూరు నుంచి హైదరాబాద్కు తీసుకు వచ్చారు.