‘ఆర్టీసీ బస్సులకు టోల్ మినహాయించాలి’ | Toll excluded to the RTC buses | Sakshi
Sakshi News home page

‘ఆర్టీసీ బస్సులకు టోల్ మినహాయించాలి’

Published Mon, Feb 29 2016 3:34 AM | Last Updated on Tue, Aug 28 2018 4:00 PM

‘ఆర్టీసీ బస్సులకు టోల్ మినహాయించాలి’ - Sakshi

‘ఆర్టీసీ బస్సులకు టోల్ మినహాయించాలి’

సాక్షి, హైదరాబాద్: టోల్ ప్లాజాల వద్ద పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ వాహనాలను మినహాయించినందున అదే తరహాలో ఆర్టీసీ బస్సులను కూడా పన్ను నుంచి మినహాయించాలని ఆర్టీసీ తెలంగాణ ఎన్‌ఎంయూ డిమాండ్ చేసింది. గతంలో దీనికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సానుకూలత వ్యక్తంచేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని యూనియన్ నేతలు నాగేశ్వరరావు, మౌలానా, రఘురామ్, లక్ష్మణ్‌లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆరు నెలల కిందట ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ హామీని వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement