'గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు' | TRS will win in GHMC Elections, says Nayani Narsimha Reddy | Sakshi
Sakshi News home page

'గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు'

Published Wed, Dec 2 2015 6:15 PM | Last Updated on Sat, Oct 20 2018 5:05 PM

'గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు' - Sakshi

'గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు'

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక వార్డులను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం హైదరాబాద్లో నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు పట్టిన గతే గ్రేటర్ ఎన్నికల్లో కూడా పునరావృతమవుతుందని చెప్పారు.

కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ వైపే చూస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement