
గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరి అరెస్టు
గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. డార్జిలింగ్ నుంచి వచ్చి హిమాయత్నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలిక.. తనపై తన బోయ్ఫ్రెండు, అతడి ఆరుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో నారాయణగూడ పోలీసుస్టేషన్ వద్దకు దాదాపు అపస్మారక స్థితిలో వచ్చిన ఆమె.. తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదుచేసింది.
బ్యూటీపార్లర్లో పనిచేసే తనను బోయ్ఫ్రెండు ప్రేమ పేరుతో మోసం చేశాడని, స్నేహితులతో కలిసి తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదుచేసింది. తనను సికింద్రాబాద్లోని ఓ పార్కుకు పిలిచి స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపింది. ఆమె బోయ్ఫ్రెండు సహా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.