స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం | Lover, his friends rape women, police case filed in hyderabad | Sakshi
Sakshi News home page

స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం

Published Mon, Apr 6 2015 8:09 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం - Sakshi

స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం

హైదరాబాద్: ప్రియుడు, అతడి స్నేహితులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి (19) పోలీసులను అశ్రయించింది. బాధితురాలు ఈ ఘటనపై ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. డార్జిలింగ్కు చెందిన ఆమె గత కొంతకాలంగా గాంధీనగర్లో నివసిస్తోంది. ఆమె ఓ ప్రయివేటు బ్యూటీపార్లర్ లో పని చేస్తోంది. గత రాత్రి తన బాయ్ఫ్రెండ్ ... స్నేహితులు ఆరుగురితో కలిసి హిమాయత్ నగర్  సమీపంలో తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు యువతి తన ఫిర్యాదులో  పేర్కొంది.  

పోలీస్ స్టేషన్కు వచ్చిన సమయంలో ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రియుడితో పాటు అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు. అయితే వారి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం జరిగిందా, లేక ప్రేమికుల మధ్య ఏదైనా గొడవ జరిగి యువతి అతనిపై ఫిర్యాదు చేసిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement