ప్రియుడు ఎస్ఐ.. ప్రియురాలు ఐపీఎస్! | Two held for police-recruitment job fraud in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రియుడు ఎస్ఐ.. ప్రియురాలు ఐపీఎస్!

Published Wed, Dec 3 2014 1:35 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

ప్రియుడు ఎస్ఐ.. ప్రియురాలు ఐపీఎస్! - Sakshi

ప్రియుడు ఎస్ఐ.. ప్రియురాలు ఐపీఎస్!

హైదరాబాద్ : మోసం చేయటంలో తమకు తామే దిట్ట అనుకున్నారు.   ఏకంగా హైదరాబాద్ కమిషనర్ కార్యాలయాన్నే ఎంచుకున్నారు.   ఇందుకోసం ఓ వ్యక్తి ..తన ప్రియురాలితో కలిసి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన సికింద్రాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే పోలీస్ రిక్రూట్మెంట్ పేరుతో భరత్ అనే వ్యక్తి నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తాడు. అంతే కాకుండా తన ప్రియురాలిని ఐపీఎస్ అధికారిణిగా ..నిరుద్యోగులకు పరిచయం చేశాడు. పోలీస్ ఉద్యోగాలు వస్తాయంటూ ఆశపడిన నిరుద్యోగుల వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అభ్యర్థుల సర్టిఫికేట్లను కమిషనర్ కార్యాలయంలోనే భరత్ పరిశీలించినట్లు సమాచారం.

అయితే ఉద్యోగాలు ఎప్పుడంటూ అభ్యర్థులు ఒత్తిడి తేవటంతో...అదిగో ఇదిగో..అంటూ మొహం చాటేయటంతో బాధితులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. దాంతో నకిలీ ఎస్ఐ, ఐపీఎస్ల బాగోతం బయటపడింది. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement