చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను బుధవారం హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో దొంగతానాలు చేస్తున్న పాలకొలను రాజశేఖర్ రెడ్డి(30), నేరెళ్ల సునీల్(33)లు ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు.
వీరిని హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతవరకూ వీరు 31 తులాల బంగారం, సుమారు రూ.9 లక్షల నగదు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. త్వరలోనే వీరి నుంచి సొమ్ము రికవరి చేస్తామని పోలీసులు తెలిపారు.