
లిఫ్టులో చిక్కుకున్న దత్తన్న
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లిఫ్టులో చిక్కుకుపోయిన సంఘటన భద్రతా సిబ్బందితోపాటు బీజేపీ కార్యకర్తలకు ముచ్చెమటలు పట్టించింది.
ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ కాచీగూడాలోని ఓ భవంతికి వెళ్లిన దత్తాత్రేయ వేదిక వద్దకు చేరుకునేందుకు లిఫ్టు ఎక్కారు. ఆయన లోపలికి ప్రవేశించిన తర్వాత కొద్దిగా కదిలిన లిఫ్ట్.. రెండు అంతస్తుల మధ్య ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ఆందోళనకు గురైన పోలీసులు కాసేపటి తర్వాత లిఫ్టును తెరవగలిగారు. కేంద్ర మంత్రి సురక్షితంగా బయటికి వచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కొద్దిరోజుల కిందట బీజేపీ జాతియ అధ్యక్షుడు అమిత్ షా బీహార్ రాజధాని పాట్నాలో లిఫ్టులో చిక్కుకుపోయిన సంగంతి తెలిసిందే. తాజాగా బీజేపీ అగ్రనేతల్లో ఒకరిగా కొనసాగుతున్న దత్తాత్రేయ కూడా లిఫ్టులో యాదృచ్చికం.