రేపు ఖమ్మంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ పర్యటన | Union minister Bandaru Dattatreya to visit Khammam tomarrow | Sakshi
Sakshi News home page

రేపు ఖమ్మంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ పర్యటన

Published Wed, May 27 2015 1:02 PM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM

Union minister Bandaru Dattatreya to visit Khammam tomarrow

ఖమ్మం: కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి బండారు దత్తాత్రేయ ఈనెల 28న ఖమ్మంలో పర్యటించనున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీధర్‌రెడ్డి బుధవారం తెలిపారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన ప్రగతిపై ప్రజలకు వివరించేందుకు జరుగుతున్న మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఖమ్మం నగరంలోని 6, 16 డివిజన్ల ప్రజలతో కేంద్రమంత్రి మాట్లాడతారని చెప్పారు. అనంతరం శ్రీనివాస్‌నగర్‌లోని రత్నాగార్డెన్స్‌లో జరిగే బీజేపీ సమావేశానికి హాజరవుతారని శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement