టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ, పర్యావరణానికి హాని లేకుండా, తక్కువ ఖర్చుతో నీటి సంరక్షణ పద్ధతులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. చతుర్విధ జలప్రక్రియ ఫలితాలపై మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి గురువారం గాంధీభవన్‌లో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి డి.కె.అరుణ తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఉత్తమ్ మాట్లాడుతూ భారీ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల భూనిర్వాసితులు పెరుగుతారని, ముంపు ప్రాంతం పెరుగుతుందన్నారు. ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి భారీస్థాయిలో నిధులు అవసరమవుతున్నాయని, ప్రజలపై భారం పెరుగుతున్నదన్నారు. మెదక్ జిల్లాలో వాటర్‌షెడ్ కార్యక్రమాలతో వచ్చిన ఫలితాలు సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చాయా అని మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు.