హైదరాబాద్: పేదల కల్పతరువుగా పేరున్న ఉస్మానియా ప్రభుత్వాసుపత్రిలో నీరు కరువైంది. గత మూడు రోజులుగా నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో కొన్ని ఆపరేషన్లు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎమర్జన్సీ ఆపరేషన్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించేందుకు శనివారం ఏర్పాట్లు చేసిటన్లు ఆసుపత్రి ఉన్నతాధికారులు వెల్లడించారు.
మరో వైపు కనీస అవసరాలకు కూడా నీరు దొరక్క రోగులు, వారి బంధువులు ఆసుపత్రిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యకు వాటర్ వర్క్స్ పైప్‌లైన్లకు చేపట్టాల్సిన మరమ్మతుల ఆలస్యమే కారణమని తెలుస్తోంది. నీటి కొరత కారణంగా ఆస్పత్రిలో అపరిశుభ్ర వాతావరణం మరింత తీవ్రమైంది.