ప్రాజెక్టుల్లోకి క్రమంగా ప్రవాహాలు
35,500 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండటంతో అక్కడ నిల్వలు 51.81 టీఎంసీలకు చేరాయి. తుంగభద్రలోకి సైతం రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నారాయణపూర్‌లోకి పెద్దగా ప్రవాహం లేకపోవడంతో దిగువ జూరాలకు నీటి ప్రవాహాలు కరువయ్యాయి. శ్రీశైలం నుంచి నీటి విడుదలతో నాగార్జున సాగర్‌లోకి 6 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్‌లోని ఉపనదుల్లో ప్రవాహాలు వచ్చి చేరడంతో సింగూరుకు 1,800 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఇక్కడ నీటి నిల్వ 29.9 టీఎంసీలకుగానూ 18.2 టీఎంసీల మేర ఉంది. ఎస్సారెస్పీకి 600, నిజాంసాగర్, కడెంలకు 230 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది.
అయితే ఎగువ మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటం, గైక్వాడ్ ప్రాజెక్టుకు 13 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉన్న నేపథ్యంలో దిగువకు త్వరలోనే నీరొచ్చే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అంచనా వేస్తోంది. మరోవైపు మధ్యతరహా ప్రాజెక్టులైన తాలిపేరుకు 8,500, వైరాకు 2,763, కిన్నెరసానికి 3,761, పెద్దవాగుకు 1,176, లంకసాగర్‌కు 544 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి.