Water streams
-
దంచికొడుతున్న వానలు.. పొంగుతున్న వాగులు, వంకలు
వాగులకు జలకళ కోస్గి: మండలంలో మూడు రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో పాటు ముశ్రీఫా, బిజ్జారం వాగుల్లో నూతనంగా నిర్మించిన చెక్ డ్యాంల్లో వర్షం నీరు నిలిచి వాగులకు జలకళ సంతరించుకుంది. ముశ్రీఫా వాగులో చెక్ డ్యాం నిండి పైనుంచి నీటి ప్రవాహం మొదలైంది. బిజ్జారం వాగులో సైతం చెక్ డ్యాం వరకు నీరు చేరింది. సోమవారం రాత్రి మండలంలో 4.1 సెం.మీ వర్షం నమోదు కాగా ముశ్రీఫా, బిజ్జారం చెక్ డ్యాంల నిర్మాణంతో ముంగిమళ్ల, కొత్తపల్లి వాగులు నీటి ప్రవాహంతో ఆకట్టుకున్నాయి. రెండు రోజుల ముందు నుంచే మండలంలోని ముంగిమళ్ల రామస్వామి కత్వ అలుగు పారడంతో పాటు ముశ్రీఫా చెక్ డ్యాం సైతం అలుగుపారడంతో ఈ దృశ్యాల్ని చూసేందుకు మండల ప్రజలు తరలివెళ్తున్నారు. సాక్షి, సిరికొండ(బోథ్):వాననీటిని ఒడిసి పట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. చినుకులా రాలిన నీటి బిందువులు ఏకమై వరదలా పారుతూ వాగుల ద్వారా చెక్‌డ్యామ్‌లలోకి చేరుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిరికొండ మండలంలో నిర్మించిన చెక్‌డ్యాం నిండి ఇలా మత్తడి పోస్తోంది. మత్తడి దుముకుతున్న ‘భద్రకాళి’ సాక్షి, వరంగల్: నగరంలోని చారిత్రక భద్రకాళి చెరువు పరవళ్లు తొక్కుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా మారింది. మంగళవారంనుంచి చెరువు మత్తడి పోస్తోంది. నగరవాసులు ఈ దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు. కొంతమంది ఫొటోలు దిగారు. మరికొందరు ఈత కొట్టారు. మోగి తుమ్మెద వాగుకు జలకళ నంగునూరు(సిద్దిపేట): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంగునూరు మండలం గుండా పారే మోగి తుమ్మెద వాగు జలకళ సంతరించుకుంది. సోమవారం కురిసిన వర్షానికి వాగు పరివాహక ప్రాంతంలో నుంచి భారీగా వరద నీరు చేరింది. మంగళవారం ఉదయం ఖాత గ్రామంలో నిర్మించిన చెక్‌డ్యాం నిండి మత్తడి పారింది. ఘణపూర్ వద్ద నిండిన చెక్‌డ్యాం సింగూరుకు జలకళ సాక్షి, సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈసారి వర్షాలు బాగా కురిసి ప్రాజెక్ట్ పూర్తిగా నిండితే యాసంగికి ఎలాంటి డోకా ఉండదని రైతులు మురిసిపోతున్నారు. కెనాల్ ద్వారా సాగుకు నీళ్లు అందుతాయనే ఆనందంలో ఉన్నారు. తుకం పోసి వరి నాట్లకు సిద్ధమయ్యారు. వర్షాలు సరిగా కురిసినా.. కురవకపోయినా ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండితే చాలని పేర్కొంటున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.982 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 2,593 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, 386 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో అవుతోంది. సోమవారం కురిసిన వర్షానికి 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఏఈ మదర్ తెలిపారు. రెండు మూడు రోజులు ఇలాగే వర్షం కురిస్తే జలాశయం పూర్తి సామర్థ్యం చేరుకోవచ్చని ఇరిగేషన్ ఈఈ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. -
గర్భిణి మహిళ కష్టం
-
ప్రవాహాలు లేక గోదా‘వర్రీ’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వర ప్రదాయినిగా ఉన్న గోదావరికి ఈ ఏడాది నీటి ప్రవాహాలు కరువయ్యాయి. ఏటా జూన్ చివరి వారానికే ఉధృత రూపం దాల్చే గోదావరిలో ఈ ఏడాది కనీస నీటి ప్రవాహాలు కూడా నమోదవడం లేదు. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోనూ ఎక్కడా పెద్దగా నీరు వచ్చి చేరడం లేదు. ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఇప్పటివరకు కేవలం 32 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే ఏకంగా 10 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉండటం, అక్కడ అధిక వర్షాలు నమోదైతే గానీ దిగువకు నీరిచ్చే అవకాశం లేకపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. చూపంతా ఎగువ వైపే.. కృష్ణా బేసిన్‌తో పోల్చి చూస్తే గోదావరి బేసిన్లో జూన్, జూలైలో మంచి వర్షాలుంటాయి. కృష్ణాలో కాస్త ఆలస్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు ఉండటంతో ఆ సమయం నుంచే రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు నమోదవుతాయి. అయితే ఈ ఏడాది గోదావరి బేసిన్లో ఎక్కడా ఆశాజనక పరిస్థితులు లేవు. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసినా అవి గోదావరి పరీవాహకంలో లేకపోవడంతో దిగువ ఎస్సారెస్పీ, సింగూరుకు నీటి ప్రవాహాలు పెద్దగా లేవు. బాబ్లీ గేట్లు తెరిచి నెల రోజులవుతున్నా దిగువకు వచ్చింది తక్కువే. గోదావరి, ప్రాణహితలు కలిసే కాళేశ్వరం వద్ద మాత్రం ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా 3.50 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహాలు నమోదయ్యాయి. అయితే ఈ ప్రవాహాలు ప్రాణహిత నుంచి వచ్చాయే తప్ప గోదావరి నుంచి కాదు. జూన్ చివరి వారం, జూలై తొలి వారంలో ప్రాజెక్టుల్లో కొంతమేర ప్రవాహాలు కొనసాగినా అవి ప్రస్తుతం పూర్తిగా ఆగిపోయాయి. మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టుకు గడిచిన నాలుగు రోజులుగా మాత్రమే ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ఆ ప్రాజెక్టులో 102 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 50 టీఎంసీల నిల్వలున్నాయి. గతేడాదితో పోలిస్తే అక్కడ 10 టీఎంసీల నిల్వ తక్కువగా ఉంది. ఈ సీజన్లో ప్రాజెక్టులో కేవలం 9.82 టీఎంసీలు మాత్రమే కొత్తనీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నిండితే గానీ దిగువకు ప్రవాహాలుండవు. సింగూరులో 29.91 టీఎంసీలకు వాస్తవ నిల్వకు గానూ గతేడాది 18.10 టీఎంసీల నిల్వ ఉండగా.. ఈ ఏడాది కేవలం 7.66 టీఎంసీల నిల్వలున్నాయి. ఎలాంటి ప్రవాహాలు రావడం లేదు. దీంతో దీనిపై ఆధారపడ్డ 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టు నిండితే కానీ నిజాంసాగర్‌కు నీటి విడుదల కుదరదు. నిజాంసాగర్‌లో కేవలం 0.02 టీఎంసీలు మాత్రమే కొత్త నీరు రావడంతో అక్కడ 17.80 టీఎంసీలకు గానూ 2.39 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. దీంతో ఖరీఫ్‌లో 2 లక్షల ఎకరాలకు నీరందడం సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో వర్షాలు, ఎగువ నుంచి వచ్చే వరదతోనే ప్రాజెక్టులు, చెరువులు నిండే అవకాశం ఉంది. ఎస్సారెస్పీలో 15.9 టీఎంసీలే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 9.76 టీఎంసీల కొత్త నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు వాస్తవ నిల్వ 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.9 టీఎంసీల నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో దీని కింద 9.68 లక్షల ఆయకట్టు అంతా వర్షాలు, భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. గత రబీలో ఈ ప్రాజెక్టు కింద 4.97 లక్షల ఎకరాల ఆయకట్టుకు 40 టీఎంసీ మేర నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉంటుందా అనే దానిపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొత్తంగా ఈ సీజన్లో గోదా వరి ప్రాజెక్టుల్లోకి 32 టీఎంసీలు మాత్రమే కొత్త నీరువచ్చి ఆయకట్టును కలవరపరుస్తోంది. గోదావరి బేసిన్లో 20,121 చెరువులు ఉండగా 8,400 చెరువుల్లో చుక్క నీరు చేరలేదు. 5,500 చెరువుల్లో 50 శాతం కన్నా తక్కువ నీటి లభ్యత ఉంది. -
ప్రాజెక్టుల్లోకి ‘గోదావరి’
వర్షాలతో కడెం, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌లోకి ప్రవాహాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి ప్రాజెక్టుల్లోకి ఈ ఏడాదిలో తొలిసారి గరిష్ట ప్రవాహాలు నమోదవు తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, కడెం, నిజాంసాగర్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. గోదావరి బేసిన్లో ఎగువ మహారాష్ట్రలో ఉన్న గైక్వాడ్ ప్రాజెక్టులకు గరిష్టంగా 9,238 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో ఇక్కడ 102 టీఎంసీల సామర్థ్యానికి గానూ 64.6 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇక దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 5,116 క్యూసెక్కుల నీటి ప్రవాహాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ 90 టీఎంసీలకు గానూ ప్రస్తుత లభ్యత 9.66 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎగువ మహారాష్ట్రలో అధిక వర్షాలు కురిస్తేనే శ్రీరాంసాగర్‌కు మరింత ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఇక కడెం ప్రాజెక్టుకు సైతం 5,214 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. అక్కడ 7.6 టీఎంసీలకుగానూ 4.7 టీఎంసీల లభ్యత ఉంది. నిజాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి 2,600 క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఇదే బేసిన్‌లోని లోయర్‌మానేరు డ్యామ్‌కు చుక్క కూడా చేరలేదు. సింగూరులోకి 290 క్యూసెక్కుల మేర నీరొస్తోంది. కృష్ణాలో అంతంతే... ఇక కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో ఎక్కడా ప్రవాహాలు పెద్దగా కనిపించడం లేదు. ఎగువ ఆల్మట్టి నుంచి 29వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదలడంతో నారాయణపూర్‌కు 27,600 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నారాయణపూర్ నుంచి దిగువకు చుక్క విడువకపోవడంతో పెద్దగా ప్రవాహాలు లేవు. అయితే జూరాల పరీవాహకం పరిధిలో కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాజెక్టులోకి 2,052 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైంలంకి కూడా 2,238 క్యూసెక్కులు వస్తోంది. సాగర్‌లోకి 705 క్యూసెక్కులు మాత్రమే ప్రవాహం ఉంది. ఇవేవీ ప్రాజెక్టుల పరిధిలోని తాగు, సాగనీటి అవసరాలను తీర్చేలా లేవు. -
గోదా‘వరద’ ఏదీ?
- గతంతో పోలిస్తే భారీగా తగ్గిన ప్రవాహాలు - గతేడాది కాళేశ్వరం వద్ద 102 మీటర్లలో ప్రవాహాలు, ప్రస్తుతం 95 మీటర్లలోనే - ఎగువ గైక్వాడ్ సహా రాష్ట్ర ప్రాజెక్టుల్లో నిరాశాజనకంగా నిల్వలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వర ప్రదాయనిగా ఉన్న గోదావరికి ఈ ఏడాది నీటి ప్రవాహాలు కరువయ్యాయి. ప్రతి ఏటా జూన్ చివరి వారానికి ఉధృత రూపం దాల్చే గోదావరిలో ఈ ఏడాది కనీస నీటి ప్రవాహాలు నమోదవడం లేదు. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోనూ ఎక్కడా పెద్దగా నీరు వచ్చి చేరడం లేదు. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టులోనూ గతేడాదితో పోలిస్తే ఏకంగా 17 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉండటం, అక్కడ అధిక వర్షాలు నమోదైతే గానీ దిగువకు నీరిచ్చే అవకాశం లేకపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. చూపంతా పైకే.. కృష్ణా బేసిన్‌తో పోల్చిచూస్తే గోదావరి బేసిన్లో జూన్, జూలైలో మంచి వర్షాలుంటాయి. కృష్ణాలో కాస్త ఆలస్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు ఉండటంతో ఆ సమయం నుంచే రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు నమోదవుతాయి. అయితే ఈ ఏడాది గోదావరి బేసిన్లో ఎక్కడా ఆశాజనక పరిస్థితులు లేవు. ఎగువ మహారాష్ట్రలో ఇంతవరకు ఒక్క పెద్ద వర్షం నమోదు కాకపోవడంతో దిగువ ఎస్సారెస్పీ, సింగూరు, శ్రీరాంసాగర్‌కు నీటి ప్రవాహాలు పెద్దగా లేవు. బాబ్లీ గేట్లు తెరిచి 20 రోజులు కావస్తున్నా దిగువకు వచ్చింది తక్కువే. గోదావరి, ప్రాణహితలు కలిసే కాళేశ్వరం వద్ద గత ఏడాది జూన్ 17, 18 తేదీల్లోనే గోదావరి 102 మీటర్ల మట్టంతో ప్రవహించింది. దాదాపు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం ఉండగా అది ఈ ఏడాది 40 వేల క్యూసెక్కులకే పరిమితం అయింది. ఈ ప్రవాహం కూడా ప్రాణహిత నుంచి వస్తోందే తప్ప, గోదావరి నుంచి కాదు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బుధవారం కాళేశ్వరం వద్ద 80 వేల క్యూసెక్కులకు వరద పెరిగినట్లుగా తెలుస్తోంది. మిగులు జలాలూ అంతే.. ఇక ప్రతి ఏటా ధవళేశ్వరం దిగువన సముద్రంలో కలిసే గోదావరి మిగులు జలాల నీటి పరిమాణం సైతం తగ్గింది. ఈ ఏడాది సముద్రంలో కలిసిన నీరు 82.9 టీఎంసీలు ఉండగా, గతేడాది ఇదే సమయానికి 390 టీఎంసీలు, అంతకుముందు ఏడాది 710 టీఎంసీల మేర సముద్రంలో కలిసింది. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టుకు రెండు రోజులుగా మాత్రమే ఇన్‌ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్టు నిండితే గానీ దిగువకు ప్రవాహాలుండవు. ఇక కడెం, శ్రీరాంసాగర్లోనూ గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. వీటికి పెద్దగా ప్రవాహాలు సైతం రావడం లేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎగువ మహారాష్ట్రలో కురిసే వర్షాలపైనే రాష్ట్ర ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఇంకో 90 వస్తే దిగువకు కృష్ణా.. కృష్ణా బేసిన్‌లోని ఎగువ ఆల్మట్టికి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. బుధవారం 38 క్యూసెక్కుల మేర నీరొచ్చి చేరడంతో అక్కడ నీటి నిల్వ 129 టీఎంసీలకు గానూ 55.27 టీఎంసీల మేర ఉంది. దిగువ నారాయణపూర్‌కు ప్రవాహాలు లేకపోవడంతో అక్కడ 37.64 టీఎంసీల నిల్వకు 14.69 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎగువన మరో 90 టీఎంసీలు వస్తే దిగువ జూరాలకు నీటి ప్రవాహం ఉండే అవకాశం ఉంది. -
ప్రాజెక్టుల్లోకి క్రమంగా ప్రవాహాలు
- ఎగవ గైక్వాడ్ ప్రాజెక్టుల్లోకి 13 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - సింగూరు, ఎస్సారెస్పీకి మొదలైన ప్రవాహం - మధ్యతరహా ప్రాజెక్టుల్లోనూ ఆశాజనకం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. అలాగే ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలు దిగువ ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతుండటంతో సింగూరు, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎగువ కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి స్ధిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల కిందటి వరకు రోజుకు 2.5 టీఎంసీల మేర నీరు వచ్చి చేరగా అది మంగళవారానికి 3 టీఎంసీలకు చేరింది. 35,500 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండటంతో అక్కడ నిల్వలు 51.81 టీఎంసీలకు చేరాయి. తుంగభద్రలోకి సైతం రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నారాయణపూర్‌లోకి పెద్దగా ప్రవాహం లేకపోవడంతో దిగువ జూరాలకు నీటి ప్రవాహాలు కరువయ్యాయి. శ్రీశైలం నుంచి నీటి విడుదలతో నాగార్జున సాగర్‌లోకి 6 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్‌లోని ఉపనదుల్లో ప్రవాహాలు వచ్చి చేరడంతో సింగూరుకు 1,800 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఇక్కడ నీటి నిల్వ 29.9 టీఎంసీలకుగానూ 18.2 టీఎంసీల మేర ఉంది. ఎస్సారెస్పీకి 600, నిజాంసాగర్, కడెంలకు 230 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. అయితే ఎగువ మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటం, గైక్వాడ్ ప్రాజెక్టుకు 13 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉన్న నేపథ్యంలో దిగువకు త్వరలోనే నీరొచ్చే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అంచనా వేస్తోంది. మరోవైపు మధ్యతరహా ప్రాజెక్టులైన తాలిపేరుకు 8,500, వైరాకు 2,763, కిన్నెరసానికి 3,761, పెద్దవాగుకు 1,176, లంకసాగర్‌కు 544 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. -
అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల..
ఆల్మట్టి, తుంగభద్రకు భారీ ఇన్‌ఫ్లో.. రాష్ట్ర ప్రాజెక్టులకు మాత్రం ఇంకా కరువే సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు మొదలయ్యాయి. ఎగువన కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టిలోకి ఏకంగా 29వేల క్యూసెక్కుల పైచిలుకు ప్రవాహం వస్తోంది. అయితే రాష్ట్ర ప్రాజెక్టుల్లో మాత్రం ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. కృష్ణా పరివాహకంలో గడిచిన పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన ఉన్న ఆల్మట్టికి భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. ఆల్మట్టి వాస్తవ నీటి మట్టం 1,705 అడుగులు కాగా ప్రస్తుతం 1,675.2 అడుగుల్లో నీటి లభ్యత ఉంది. ఈ ప్రాజెక్టులో 129.7 టీఎంసీలకు గాను గురువారం ఉదయానికి 33.7 టీఎంసీల నిల్వ ఉంది. ఇక తుంగభద్ర ప్రాజెక్టులో 11,506 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. ఇక్కడ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.64 టీఎంసీల నీటి లభ్యత ఉంది. కాగా, ఆల్మట్టికి ప్రవాహం మరింత పెరిగి, ప్రాజెక్టునిండితేనే దిగువ నారాయణఫూర్‌కు ఇన్‌ఫ్లో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో 37.64 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గానూ 14.87 టీఎంసీల లభ్యత ఉంది. ఈ ప్రాజెక్టు నిండితేనే దిగువ జూరాలకు ప్రవాహం మొదలవుతుంది. కాగా రాష్ట్ర పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఎక్కడా ప్రవాహాలు లేవు. జూరాలకు రెండు రోజుల కిందటి వరకు ప్రవాహాలున్నా అవి గురువారానికి తగ్గిపోయాయి.