గ్రేట్ కుదుపు
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ
జలమండలి ఉన్నతాధికారుల బదిలీ
గ్రేటర్ కొత్త కమిషనర్‌గా జనార్దన్‌రెడ్డి
హెచ్‌ఎండీఏకు చిరంజీవులు
సిటీబ్యూరో: ఐఏఎస్‌ల బదిలీలతో జీహెచ్‌ఎంసీలో మహా కుదుపు చోటు చేసుకుంది. గ్రేటర్‌లో ప్రజలకు సేవలందించే... అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే ముఖ్య విభాగాలైన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్‌తో పాటు స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్, హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా, జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ జి.కిషన్‌లను బదిలీ చేశారు.
జీహెచ్‌ఎంసీకి కొత్త బాస్
మున్సిపల్ పరిపాలన కమిషనర్, డెరైక్టర్‌గా ఉన్న బి.జనార్దన్ రెడ్డిని జీహెచ్‌ఎంసీ కొత్త కమిషనర్, స్పెషలాఫీసర్‌గా నియమించారు. ఆయన జలమండలి ఎమ్‌డీగానూ పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా టి.చిరంజీవులును నియమించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్‌గా ఉన్న అనితా రామచంద్రన్‌ను జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
ఇదీ నేపథ్యం: జీహెచ్‌ఎంసీ కొత్త బాస్ జనార్దన్‌రెడ్డి గతంలో చిత్తూరు, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్‌గా, వరంగల్, అనంతపురం జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. 1996 బ్యాచ్‌కు చెందిన ఆయనకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖల్లో, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో మంచి అనుభవముంది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా నియమితులైన చిరంజీవులు గతంలో అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జాయింట్ కలెక్టర్‌గా, నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ, హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ విభాగాల్లోనూ విధులు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నియమితులైన అనితా రామచంద్రన్ గతంలో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేశారు.