![we only putting pressure on kids - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/24/sell.jpg.webp?itok=xy96Hkhn)
సాక్షి, హైదరాబాద్: చదువుల విషయంలో పిల్లలపై తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడి పెంచుతున్నారని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. తమ లక్ష్యాలను పిల్లల ద్వారా సాధించుకునేందుకు మోయలేనంత భారాన్ని మోపుతున్నారని పేర్కొంది. ఇంత ఒత్తిడిని తట్టుకునే శక్తి పిల్లలకు ఉండటం లేదంది. విద్యార్థులు ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, హోంశాఖ, విద్యాశాఖల ముఖ్య కా ర్యదర్శులు, ఇంటర్ బోర్డు కార్యదర్శులు, నిమ్స్, స్విమ్స్ డైరెక్టర్లతో పాటు కార్పొరేట్ కాలేజీలైన నారాయణ, శ్రీచైతన్యలకు హైకో ర్టు నోటీసులిచ్చింది.
విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారామ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ కాలేజీలు, ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై న్యాయ విచారణతోపాటు యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ఆదేశించా లని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన లోక్‌సత్తా అజిటేషన్ సొసైటీ జిల్లా కన్వీనర్ దాసరి ఇమ్మాన్యుయేల్ రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు విచారణకు స్వీకరించింది.
మంత్రి నిర్వహిస్తున్న కాలేజీల్లో ఆత్మహత్యలు...
కార్పొరేట్ కాలేజీల్లో ఇటీవల పది మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారిని చూ సేందుకు తల్లిదండ్రులను సైతం యాజమాన్యాలు అ నుమతించలేదని ఇమ్మాన్యుయేల్ తన లేఖలో పేర్కొ న్నారు. ఆత్మహత్యలు జరుగుతున్న కాలేజీల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రికి చెందినదని వివరించారు. ఆయన నడుపుతున్న కాలేజీలు, హాస్టళ్లకు అనుమతు లు లేవని, దీనిపై పత్రికల్లో సైతం కథనాలు వచ్చాయ ని నివేదించారు.
మంత్రి కావడంతో కాలేజీల్లో ఆత్మహత్యలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ముందు కు రావడం లేదన్నారు. నారాయణ, శ్రీచైతన్య ఎలాం టి అనుమతులు లేకుండా కాలేజీలు నడుపుతున్నట్లు ఇంటర్ బోర్డు సైతం ఇప్పటికే నివేదిక సమర్పించిం దని తెలిపారు. ఆ కాలేజీల్లో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై న్యాయ విచారణ జరిపించడంతోపాటు యాజమాన్యాలపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశించాలని అభ్యర్థించారు. కనీస సదుపాయాలు లేని కాలేజీలపై చర్యలకు ఆదేశించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment