
'కరువు పరిస్థితుల్లో గోవులను కాపాడుకోవాలి'
మణికొండ(హైదరాబాద్): రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు గోవులను పరిరక్షించేందుకు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని రాష్ట్ర గోసేవాదళ్ అధ్యక్షుడు అంతారం నరేశ్‌కుమార్ కోరారు. ఆయన ఆదివారం గండిపేట్ గోశాలలోని గోవులకు లారీలో తీసుకువచ్చిన పచ్చిగడ్డిని వేసి తినిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నోరులేని జీవులు ఆకలితో అలమటిస్తుంటే నోరున్న మనం మనవంతుగా వాటిని ఆదుకోవాలన్నారు. గోవులు ఎక్కడ కనిపించినా వాటికి కడుపునింపే మార్గాన్ని ఆలోచన చేయాలని, ఆసేవ ఎంతో పుణ్యాన్ని ఇస్తుందన్నారు.